రేణుదేశాయ్ నిర్మాతగా మరాఠీ సినిమా

renu desai

రేణుదేశాయ్ నిర్మాతగా వస్తున్నారు. అయితే తెలుగులో కాదు. ఆమె మాతృ బాష మరాఠీలో. స్వప్నిల్‌జోషి, ముక్తా బార్వే ఇందులో హీరో, హీరోయిన్లు. పుణెలో పుట్టి, పెరిగినందువల్లే నిర్మాతగా తన తొలి ప్రయత్నాన్ని మరాఠీ సినిమాతో శ్రీకారం చుట్టారు రేణుదేశాయ్. ‘మంగళష్టక్ వన్స్‌మోర్’ పేరుతో ఆమె ఆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఓ భార్య, ఓ భర్త తమ వివాహ బంధాన్ని కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నమే ఈ సినిమా కథ అని తెలుస్తోంది. “ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆమె కలిసుండటం లేదు” అనే ప్రచారం పబ్లిక్ లో వుండటం వలన, వాళ్ళిద్దరూ కలిసి మీడియాకు ఒక్కసారి కనిపిస్తే చూడాలని ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు.

Filed Under: Pawan KalyanFeatured