చిరంజీవి గారు, రాజకీయాలలో నటించండి సార్

Screenshot from 2013-01-12 15:15:26

నందమూరి అభిమానులు, ఘట్టమనేని అభిమానులు, అక్కినేని అభిమానులు, కొణిదెల అభిమానులు .. ఇలా మాత్రమే తెలుగుప్రేక్షకులు వర్గాలుగా విడిపొయారు అనుకుంటే పొరబాటు. ఒక్కొక కుటుంబంలో హిరోలు ఎక్కువై పొయి ప్రతి కుటుంబ అభిమానులలో సబ్ వర్గాలు ఏర్పడ్డాయి. పెద్దగా ఫాలో అవ్వను కాబట్టి మిగతా అభిమానుల గురించి అంతగా తెలియదు. మెగా అభిమానులలో వర్గాల గురించి తెలుసుకుందాం.

 1. exclusive చిరంజీవి అభిమానులు
 2. చిరంజీవి, పవన్‌కల్యాణ్, రామ్‌చరణ్ మాత్రమే .. (కొణిదెల అభిమానులు) no Allu Arjun
 3. ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం including Allu Arjun (megafans)
 4. exclusive పవన్‌కల్యాణ్ అభిమానులు

ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. BUT అన్నీ వర్గాలకు చిరంజీవి is GOD(in terms of RESPECT). చిరంజీవి vs ANYONE in the WORLD, చిరంజీవి తర్వాతే ఎవరైనా.

 1. చిరంజీవి రాజకీయలలోకి రావడం తప్పు కాదు ..
 2. చిరంజీవి ఘోరంగా ఓడిపోవడం తప్పు కాదు .. ఘోరం అని ఎందుకంటున్నాను అంటే 18% is nothing for his image
 3. కాంగ్రెస్ లో విలీనం అయిపోవడం తప్పు కాదు .. పొరాడలేక విలీనం అని నిజాన్ని ఒప్పుకోలేక గౌరవమైన పిలుపుకు వెళ్ళిపోయాను అని చెప్పుకోవడం కూడా తప్పు కాదు ..
 4. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మొదలయ్యి కాంగ్రెస్ ను పొగడటం కూడా తప్పు కాదు ..
 5. 150వ చిత్రం చెయ్యడం కూడా తప్పు కాదు ..

మీ నుంచి అద్భుతాలు ఎక్సపెట్ చెయ్యడం వలన కొన్ని మెగా అభిమాన వర్గాలకు అవి తప్పులుగా కనిపిస్తున్నాయి. చాలా డౌట్స్ తో మీ మనసులోని మాట తెలుసుకోవాలని కూడా వుంది.

మీరు కనపడినప్పుడల్లా మీడియా , అభిమానులు .. తమకు తోచిన ప్రశ్నలు వేస్తారు .. మీరు చెప్పే సమాధానంలో హుందాతనం కోరుకుంటున్నాము. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. రాజకీయం అంటే ఒక బాద్యత, రాజకీయాలకు గౌరవం తీసుకొని వస్తాను అనే మాటకు కట్టుబడి వుండటంతో పాటు, మీ మాటల్లో వినిపించేలా చేతల్లో కనిపించేలా కేర్ తీసుకొవాలని విజ్ఞ్హప్తి.

 1. మీరు పొద్దున్న ఒక సమస్యపై సీరియస్ గా పోరాటం చేసి, సాయంత్రం ఒక ఆడియో ఫంక్షన్ లో హ్యాపీగా కనిపిస్తే …
 2. మీరు మూడు గంటలు ఒక కేంద్ర మంత్రిగా మీరు చేస్తున్న అభివృద్ది గురించి మాట్లాడి, ఒక నిమషం పాటు మీ 150వ సినిమా గురించి మాట్లాడితే ..

మీరు పడే కష్టానికి, మీరు చేసే అభివృద్ధికి అర్దం మారిపోతుంది.

మీరు 150th సినిమా చెయ్యాలని కోరుకునే వారు వున్నారు.
మీరు రాజకీయలలో కొనసాగుతున్నారు కాబట్టి, రాజకీయంగా అత్యున్నత స్థాయిలో చూడాలని కోరుకునే వాళ్ళు కూడా వున్నారు.

మీరు చేసే సినిమా పనులు తెర వెనుకకు పరిమితం చేసి, తెరమీద ఒక సీరియస్ రాజకీయ నాయకుడుగానే కనిపించాలని ఒక మెగా అభిమాని కోరిక/విన్నపం.

మీరు రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకోవడం లేదు, స్కామ్లు చెయ్యరు అని తెలుసు. ‘గాంధీ బాట’ ఇమేజ్ ప్రజలకు నచ్చలేదు. అభిమానులకు కూడా నచ్చడం లేదు. సినిమాలపై ఆసక్తి వున్నా, అది ఏ విధంగాను బయటకు కనపడనీయకుండా ఒక సీరియస్ రాజకీయ వేత్తగా నటించండి సార్. అభిమానులే కాదు, ప్రజలు కూడా ఈజీగా నమ్మేస్తారు.

Filed Under: Mega Family