మీడియాలో వచ్చే న్యూస్ కు రెస్పాండ్ అవ్వాలా? లేదా?

Chiranjeevi

మేము కూడా ఒక వెబ్ సైటు మెయింటేన్ చేస్తున్నాం. మా లక్ష్యం “పవన్ ఫ్యాన్స్ అభిప్రాయాలు ఇవి అని తెలియజేయాలి” . మేము తెలియజేయకపొతే ఒకరికి వచ్చే నష్టం లేదు, తెలియజేసినంత మాత్రానా మాకోచ్చే ఆదాయం కూడా ఏమి లేదు. మరెందుకు వెబ్ సైటు మెయింటేన్ ఎందుకు అంటే ‘అదో గుల’ అంతే.

స్వలాభం లేకపోతే ఎవరూ ఏమీ చెయ్యలేరు. చేసినా ఒక రోజు చేస్తారు, ఒక వారంచేస్తారు, ఒక నెల చేస్తారు, ఒక సంవత్సరం చేస్తారు. కాని నిరంతరం చెయ్యాలంటే కష్టం. అతి కష్టం మీద pawanfans.com వెబ్ సైటు నడుపుతూ, అవి ఇవి అని లేకుండా అన్నీ న్యూస్లు కలిపి కొడుతున్నాం.

మా సైటు ఎంత మంది ఫాలో అవుతున్నారో తెలియదు కానీ, అక్కడా ఇక్కడా విన్న న్యూస్ ను మాకు నచ్చిన విధంగా మార్చేసి పబ్లిష్ చేసుకొని, అది చదువుకుంటే అదో తృప్తి.

మెగా ఫ్యామిలి మీద బ్యాడ్ న్యూస్ వస్తే చాలా బాదేస్తుంది. చిరంజీవి రాజకీయాల లోకి రావడం మూలానా చిన్న సంఘటన జరిగితే చాలు, పూర్తి వివరాలు సేకరించ కుండానే తప్పు అంతా చిరంజీవి ఫ్యామిలికి అంటగట్టేసి చిరంజీవి మీద బురద జల్లే ప్రయత్నాలు ఈ టి.డి.పి అండ్ వైయస్సార్ పార్టీలకు చెందిన మీడియాలు చేసేస్తున్నాయి.

పవన్ కళ్యాన్ మీద వచ్చినటువంటి రూమర్స్ వేరే ఏ హిరో మీద రాలేదు. మీడియా ముందుకు రాకపోతే రాలేదు అంటారు. వచ్చి చెపితే , అవి నిజం కాదు అంటారు. అల్లు శిరీష్ వెంటనే వచ్చి చెప్పినా కూడా ఎవరూ నమ్మలేదు.

“తప్పేదో చెప్పవలసిన మీడియానే ఇలా తప్పులు చేస్తే ఎలా?” అని ఎవరూ బాదపడటం లేదు. మనకు ఇది మామూలే కదా అని తేలిగ్గా తీసి పారేస్తున్నారు.

మనుగడ కోసం, కొంచెం కారం & వెటకారం జోడిస్తే పర్వాలేదు కాని, మరీ ఇలా మనషులను విలన్స్ గా చిత్రీకరించడం ఎంత వరకు సమంజసం. ఎవడు పాపాన వాడే పోతాడు అనుకోవడం తప్ప ఏమీ చెయ్యలేని పరిస్థితి అభిమానులది.

Filed Under: Mega FamilyFeatured