RGV 🙏🙏🙏🙏🙏🙏.

రాంగోపాలవర్మను ద్వేషించే వాళ్ళు చాలా మంది వుంటారు. కారణం ఆయన ట్వీట్స్ అనవసరంగా కెలుకుతున్నట్టుగా వుంటాయి. నిజం .. వెటకారం .. రెండూ మిక్స్ చేసి, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అర్దం చేసుకునేలా ట్వీట్స్ వదులుతాడు. సిరియస్‌గా తీసుకుంటే కోపం వస్తుంది. సరదాగా తీసుకుంటే నవ్వు వస్తుంది. జీవితం మీద విరక్తితో వున్నప్పుడు చదివితే ఉషారు వస్తుంది.

తిరిగి ఆయన్ని ఎవరైనా కెలికితే, కంట్రోల్ లూజ్ అవుతాడు. కారణం “తన అసలు వుద్దేశం అర్దం చేసుకొలేదు అపార్దం చేసుకున్నారు” అని ఎలా చెప్పాలో తెలియక అందరినీ కన్‌ఫ్యూజ్ చేసే తనే కన్‌ఫ్యూజ్ అవుతాడు.

పవన్ కల్యాణ్ విషయంలో కూడా అంతే. “frustrated RGV”, “50+”, “పెళ్ళైన కూతురు వుంది”, “పబ్లిక్‌గా పొర్న్ మూవీస్ గురించి విచ్చలవిడిగా మాట్లాడటం” .. కీ వర్డ్స్ తో, పవన్‌కల్యాణ్ ఇచ్చిన కౌంటర్‌కు ఎలా కౌంటర్ చెయ్యాలో తెలియక, తనదే పైచేయి అనిపించుకొవడానికి ఎదేదో ట్రై చేస్తూ వచ్చాడు కాని, సక్సస్ కాలేకపొయాడు.

“బాహుబలి” సినిమాకు రాంగోపాలవర్మ పూర్తి వ్యతిరేకి. ఒక సినిమా కోసం అన్ని రోజులు పని చెయ్యడం అనే కాన్సప్ట్ కు పూర్తి వ్యతిరేకి. బాహుబలి సక్సస్ కావడంతో, వేరే ఆప్షన్ లేక తన టోన్ మార్చాడు. రాజమౌళి ఏదైతే కల గన్నాడో అది సాధించాడు కాబట్టి, ఇన్ని పొగడ్తలు వస్తున్నాయి. పవన్‌కల్యాణ్ లా ఫెయిల్ అయితే, రాజమౌళి అడ్రస్ గల్లంతయ్యేది.

జానీ సినిమాతో పవన్‌కల్యాణ్ ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. హిరోగా క్రేజ్ వుంది కాబట్టి, నిలబడగల్గాడు & ఇండస్ట్రీలో వుండగల్గాడు. సర్దార్ గబ్బర్‌సింగ్ తో మళ్ళీ ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. హిరో కాబట్టి ప్రభావం ఏమీ లేదు.

బాహుబలి తో రాజమౌళి ఏమి సాధించాడో, రాజమౌళి మీద ఎంతమంది Jealous ఫీల్ అవుతున్నారో రెండు లైన్స్ లో ఇంతకన్నా ఎవరూ బాగా చెప్పలేరు:

ఎవరైనా రాజమౌళికి సాష్టంగ నమస్కారాలు చేస్తున్నారంటే, దాని అర్దం వాళ్ళకి రాజమౌళిని విమర్శించడానికి ఏమీ లేవు. –> Courage. Passion. Rebellion. Belief in oneself. Breaking every rule. Commitment. Humility. Congratulations @ssrajamouli #Bahubali2

Ram Gopal Varma‏Verified account @RGVzoomin:
I just got admitted in hospital infected with Bb2Jealousitis and am glad to see all film makers are already admitted and many in ICU

@ssrajamouli dared to dream about a nightmare of an achievement and made it into a dream like reality for millions of audiences

Filed Under: Featuredబాహుబలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *