రుద్రమదేవి హిట్ అయితే బాగుంటుంది

Screen Shot 2015-10-04 at 11.44.55 AM

కాకతీయ సామ్రాజ్ఞి రుద్రమదేవి జీవిత గాథ ఆధారంగా రూపొందిస్తున్న చిత్రం రుద్రమదేవి. అనుష్క టైటిల్ రోల్‌లో నటిస్తుంది. గుణా టీమ్ వర్క్స్ పతాకంపై గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకురానుంది. గోనా గన్నారెడ్డిగా అల్లు అర్జున్ & రానా, కృష్ణంరాజు, సుమన్, ప్రకాష్‌రాజ్, నిత్యామీనన్, కేథరిన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రఫీ: అజయన్ విన్సెంట్, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, మాటలు: పరుచూరి బ్రదర్స్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, సమర్పణ: రాగిణీ గుణా

బాహుబలి కోసం రాజమౌళి విజువల్ కథ & ప్రెజెంటేషన్ కోసమే కష్టపడ్డాడు. రాజమౌళిని నమ్మి నడిపించింది మాత్రం యార్లగడ్డ శోభు.

రుద్రమదేవి కోసం మాత్రం కేవలం గుణశేఖర్ అన్ని బరువు బాద్యతలు భుజాన వేసుకొని ఫినిష్ చేసాడు. ఏ మాత్రం బాగున్నా సినిమాను ఆదరించడానికి తెలుగు ప్రేక్షకదేవుళ్ళు వున్నారు కాని, గుణశేఖర్ కష్టంతో పాటు ప్రెజెంటేషన్ ఎంత వరకు జనారంజకంగా చేసాడన్నదే అందరి డౌటు. గుణశేఖర్ కోసం రుద్రమదేవి హిట్ అయితే బాగుంటుందని ప్రతి ఒకళ్ళు కోరుకుంటున్నారు.

Filed Under: Extended FamilyFeatured

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *