నవ్వాలో ఏడ్వాలో తెలియని పరిస్థితుల్లో “అత్తారింటికి దారేది” రిలీజ్

Pawan Kalyan

రాష్ట్రం అంతా అట్టడుకుపోతుంది.

సీమాంధ్ర ప్రాంతానికి చెందిన లుచ్చా నాయకులు & మూర్ఖపు పనికిమాలిన మేధావులు పుణ్యమా అని సీమాంధ్ర ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

తెలంగాన ప్రజలను కూడా ఇబ్బందులు పెట్టడానికి హైదరాబాద్‌పై కేంద్రం నిర్ణయం కోసం తెలంగాన ప్రాంతానికి చెందిన లుచ్చా నాయకులు & మూర్ఖపు పనికిమాలిన మేధావులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.

తెలంగాన ఏర్పడి పొతే మేము ఎవరిని రెచ్చగొట్టాలని తెలంగాన కోసం ఏర్పడిన పార్టీ ప్రజలని ఎలా రెచ్చగొట్టాలి, ఈ ప్రక్రియను ఎలా ఆపాలని వ్యూహాలు అల్లే పనిలో వుంది.

సమైక్యాంధ్ర అనే పార్టీలు రాష్ట్రం విడిపొతే సీమాంధ్ర సీట్లు అన్నీ మావే అని తొడగొడుతున్నారు, తప్ప రాష్ట్ర విభజన గురించి ఇసుమంత కూడా వర్రీ లేదు.

విభజనకు కారకులైన అధికారం పక్షం , ప్రతి పక్షంలు ప్రజలను మరింత ఇబ్బందులకు గురిచేసే పనిలో వున్నారు.

ఇటువంటి సమయంలో “అత్తారింటికి దారేది” సినిమా రిలీజ్ అంటే నవ్వాలో ఏడ్వాలో తెలియని పరిస్థితుల్లో అభిమానులు బాదతో కూడిన ఆనందాన్ని నటిస్తున్నారు.

ఓరిడియమ్మా జీవితం. రిలీజ్‌కు ముందే సినిమా లికేజ్ అవ్వడంతో నిర్మాతకు నష్టం వాటిల్లందని, చందాల రాయుళ్ళు “అత్తారింటికి దారేది” సినిమాను అడ్డుకోరంటా! .. దానికి అభిమానులంతా గంతులేయ్యాలంటా.

రాష్ట్రంలో ఈ పరిస్థితులు కారకులైన ప్రతి నాయకుడికి ఈ క్రింది విడియోలో ఉదయభాను తిట్టిన తిట్లు వర్తిస్తాయి.

Filed Under: Pawan KalyanFeatured