21న విడుదల కానున్న ‘సాహసం’

sahasam

మొగుడు సినిమాతో కృష్ణవంశీ ఇచ్చిన షాక్ నుంచి కోలుకోవడానికి గోపిచంద్ కు చాలా కాలం పట్టింది.

‘ఒక్కడున్నాడు’ తర్వాత గోపిచంద్, చంద్రశేఖర్ ఏలేటి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘సాహసం’. ప్రస్తుతం పవన్ కళ్యాన్ తో సినిమా తీస్తున్న బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మాత. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. ఈ నెల 21న విడుదల కానుంది.

‘‘ఒక చిన్న పిల్లకాలువలా ఈ కథ మొదలవుతుంది. పోను పోను మహాసముద్రంగా మారుతుంది. ఊహకందని రీతిలో కథ, కథనాలు సాగుతాయి. ఓ సెక్యూరిటీ గార్డ్ జీవితంలోని ఆసక్తికరమైన మలుపులే ఈ సినిమా. నిధి నేపథ్యంలో సాగే అడ్వంచరస్ మూవీ ఇది. చంద్రశేఖర్ ఏలేటి ఎంతో ప్రతిష్టాత్మంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా చంద్రశేఖర్ శైలిలో ఈ సినిమా ఉంటుంది. శ్రీ స్వరాలందించిన ఈ చిత్రం పాటలు ఇప్పటికే శ్రోతలను అలరిస్తున్నాయి. శ్రీ అందించిన నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రాణం. గోపిచంద్‌కి కచ్చితంగా ఈ సినిమా మంచి విజయాన్నిస్తుంది’’

బీవీఎస్‌ఎన్ ప్రసాద్

తాప్సీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శక్తికపూర్, అలీతో పాటు ప్రముఖ తారాగణం నటించారు. ఈ చిత్రానికి మాటలు: కె.కె.రాధాకృష్ణకుమార్, కెమెరా: శ్యామ్‌దత్ ఎస్., ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, కళ: ఎస్.రామకృష్ణ, పాటలు: అనంత శ్రీరామ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుధీర్, సహ నిర్మాత: భోగవల్లి బాపినీడు, సమర్పణ: రిలయన్స్ ఎంటర్‌టైన్ మెంట్స్.

Filed Under: Extended FamilyFeatured