సాయి ధర్మ్ తేజ్ – హరీష్ శంకర్ కాంబినేషన్‌లో సినిమా

harish-pawan

పవన్‌కల్యాణ్ ఎవరి దగ్గరికీ వెళ్ళి సినిమా చెయ్యమని అడగడు. సక్సస్‌ఫుల్ దర్శకుల దగ్గరకు అయితే అసలు వెళ్ళడు. ఇది వినడానికి ఇగో అనిపిస్తుంది.

నిజానికి ఇది ఇగో కాదు. తనకు జరిగిన అవమానం కారణంగా తీసుకున్న నిర్ణయం.

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఫ్లాప్. గోకులంలో సీత అనుకున్నంత రేంజ్ సినిమా కాకపొవడం. ఈ రెండు కారణాల వలన పవన్‌కల్యాణ్‌తో సినిమా చెయ్యడానికి ప్రముఖ దర్శకులు ఆసక్తి చూపకపొవడం మాట అటుంచి చాలా అవమానకరంగా మాట్లాడే వాళ్ళంట. అప్పుడే ఈ నిర్ణయం తీసుకున్నాడంట.

ఇప్పుడు ఈ విషయం ఎందుకంటే, సాయి ధర్మ్ తేజ్‌ను చూస్తుంటే పోలికల్లో ఒకప్పుడు చిరంజీవి, స్ట్రగులింగ్‌లో ఒకప్పుడు పవన్‌కల్యాణ్‌లు గుర్తొస్తున్నారు.పేరుకు మెగా ఫ్యామిలీ అయినా, రామ్‌చరణ్ & బన్నీ లకు వున్నటువంటి ఫైనాన్సిషియల్ సపోర్ట్ & ఫ్యాన్స్ సపోర్ట్ లేదు.

vamsikaka ‏@vamsikaka Feb 21
@harish2you Last one… Heard dat ur gonna direct Sai Dharam Tej. Any truth in this?

పై ప్రశ్న వినగానే హరీష్‌శంకర్ ఏమిటి, ఈ చిన్న హిరోతో సినిమా అనిపిస్తుంది. ఈనాటి పెద్దోళ్ళు ఒకప్పుడు చిన్నోళ్ళే. ఈ న్యూస్ నిజమైతే, సాయి ధర్మ్ తేజ్ కసికి హరీష్‌శంకర్ కసి తోడయ్యి, పెద్ద హిట్ సినిమా ఇస్తారని ఆశీద్దాం.

మెగా మేనల్లుడు సాయి ధర్మ్ తేజ్ కచ్చితంగా హిరోగా నిలబడతాడు. ఆ కసి అతని కళ్ళల్లో కనిపిస్తుంది.

Filed Under: Pawan KalyanFeatured