‘ఎవడు’ షూటింగ్‌లో సల్మాన్‌ఖాన్

salman-khan-ram-charan

రామ్‌చరణ్ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపె వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రాజు నిర్మిస్తున్న ‘ఎవడు’ చిత్రం చివరి పాట(‘ఫ్రీడమ్’ సాంగ్ – సినిమాలో ఫస్ట్ సాంగ్ కావచ్చు) చిత్రీకరణ రామోజీ ఫిలింసిటీలో జరుగుతుండగా బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ ఆ షూటింగ్ స్పాట్‌కి వెళ్లాడంట.

ఈ సందర్భంగా ‘ఎవడు’ సినిమా రిలీజ్ జూలై 25 కాకపోతే, జూలై 31 అని నిర్మాత క్లూ ఇచ్చాడు. జూలై 31 అయితే, కచ్చితంగా మన “అత్తారింటికి దారేది?” ఆగష్టు 7th రాదు.

రామోజీ ఫిలింసిటీలో తీస్తున్న ‘ఫ్రీడమ్’ సాంగ్ చిత్రీకరణ పూర్తయింది. చివరి రోజున సల్మాన్‌ఖాన్ షూటింగ్‌కి వచ్చి యూనిట్‌ని అభినందించినందుకు కృతజ్ఞతలు. అల్లు అర్జున్ వర్క్ ఓ రోజు మిగిలింది. ఈ నెల 25న సినిమాని విడుదల చేయడానికి కృషి చేస్తున్నాం. ఏదన్నా సాంకేతిక కారణాల వల్ల ఆ రోజున విడుదల చేయలేకపోతే, ‘మగధీర’ చిత్రం విడుదలైన జూలై 31న చేస్తాం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. — నిర్మాత దిల్ రాజు

సినిమాలో చివరి పాట చిత్రీకరణ చివరిరోజున సల్మాన్‌ఖాన్ సెట్‌కి వచ్చారు. పాట చిత్రీకరణ చూసిన అనంతరం బాగుందని, రామ్‌చరణ్ బాగా చేశాడని అభినందించారు. పాటకి కొరియోగ్రఫీ అందించిన జానీ మాస్టర్‌ని బాలీవుడ్‌కి తీసుకెళతానని కూడా చెప్పారు.అలాగే ఈ పాట ఆన్‌లైన్ ఎడిటింగ్ చూసి ఆయన ఆశ్చర్యపోయారు. మా సెట్‌కి వచ్చి పేరుపేరునా అందరినీ అభినందించిన సల్మాన్‌ఖాన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. — దర్శకుడు పైడిపల్లి వంశీ

Filed Under: Mega FamilyFeatured