జస్ట్ గబ్బర్‌సింగ్ కేరెక్టరైజైషన్ మాత్రమే

Pawan-Kalyan-Sampath-Nandi

సంపత్ నంది పుట్టినరోజు సందర్భంగా, ఆయన సాక్షితో పంచుకున్న విశేషాలు:

సాక్షి: పవన్‌కల్యాణ్‌తో ట్రావెలింగ్ ఎలా ఉంది?
సంపత్ నంది: అదేంటో కానీ, ఆయన్ను కలిసిన ప్రతిసారీ కొత్తగా అనిపిస్తుంది. ఫుల్ ఛార్జ్ అయిపోతుంటాం. నేనూ పుస్తకాలు బాగా చదువుతాను. కానీ పుస్తకాల్ని ఆయన అర్థం చేసుకున్నంత గొప్పగా నేను అర్థం చేసుకోలేదనిపిస్తుంది. పుస్తకం మొత్తం సారాన్ని సింగిల్ కొటేషన్‌లో చెప్పేయగలరాయన.

సాక్షి: పవన్ కల్యాణ్‌తో మీరు చేయబోయేది ‘గబ్బర్‌సింగ్’కి సీక్వెలా?
సంపత్ నంది: సీక్వెల్ కాదు, ప్రీక్వెల్ కాదు. జస్ట్ గబ్బర్‌సింగ్ కేరెక్టరైజైషన్ మాత్రమే తీసుకుని అల్లిన వేరే కథ ఇది. జేమ్స్ బాండ్ సినిమాలే తీసుకోండి. అవి వేటికవే ప్రత్యేకం. వాటికీ సీక్వెల్స్, ప్రీక్వెల్స్ ఉండవ్. మా సినిమా కూడా అంతే.

సాక్షి: అసలు మళ్లీ గబ్బర్‌సింగ్ పాత్రతో సినిమా చేద్దామనే ఆలోచన ఎందుకొచ్చినట్టు?
సంపత్ నంది: ఈ ఆలోచన నాది కాదు. పవన్‌కళ్యాణ్‌ది. అసలు నేనాయన్ని కలిసింది వేరే కథతో. అది ఆయనకు బాగా నచ్చేసింది. ఆ వర్క్‌లో ఉన్నప్పుడే ‘గబ్బర్‌సింగ్’ ఆలోచన గురించి చెప్పి, ‘ముందు ఇది చేద్దాం. తర్వాత నీ కథతో చేద్దాం’ అన్నారు. నేను రెండు నెలల్లోనే ఈ స్క్రిప్టు రెడీ చేసేశాను.

సాక్షి: అంత త్వరగా కథ ఎలా చేయగలిగారు?
సంపత్ నంది: ముందు రచయితని. ఆ తర్వాతే దర్శకుణ్ణి. ఈ పదకొండేళ్లలో చాలా సినిమాలకు స్క్రిప్ట్ వర్క్ చేశాను. పవన్‌కల్యాణ్ నటించిన తొలిప్రేమ, ఖుషీలాంటి సినిమాలు విపరీతంగా చూసినవాణ్ణి. ఓ అభిమానిగా ఆయన్నుంచి ప్రేక్షకులు ఏం ఆశిస్తారో నాకు బాగా తెలుసు. ‘రచ్చ’ టైంలో చిరంజీవిగారు నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను. ఇప్పుడు కూడా నిలబెట్టుకుంటా. కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలతో పాటు సాంకేతికంగా కూడా ఈ సినిమా ఉన్నత స్థాయిలో ఉంటుంది.

Filed Under: Pawan KalyanFeatured