బన్నిని ఫాలో అవుతున్న సంపూ

SDT

Sampoornesh ‏@sampoornesh
Please trend #KobbariMattaTeaserLaunch
Please support ALL STAR FANS
Sadha mee premaki banisa

Repu maa supreme hero @IamSaiDharamTej gari chethula meedhuga Teaser launch. #KobbariMattaTeaserLaunch. 5:30pm ki

Adigina ventane…Voppesukuni…pedha manasutho vasthaanu anna @IamSaiDharamTej gariki…vaari manchi manasuki namaskaralu.

సరైనోడు సినిమా ద్వారా సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసారు అల్లు ఫ్యామిలీ. ఏ సినిమా అయినా బ్లాక్‌బస్టర్ కావాలంటే అందరూ చూడాలి. ఫ్యాన్స్ హడావుడి వలన ఏ మాత్రం ప్రయోజనం లేదనే విషయాన్ని గ్రహించారు. తన సినిమా చూసే వాళ్ళంతా తన ఫ్యాన్సే అంటూ, అల్లు అర్జున్‌ను ఎంతగానో ఇష్టపడే మెగాఫ్యాన్స్‌ను కావాలని ఇగ్నోర్ చేస్తూ, సినిమాను ఆదరించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు అంటూ సరికొత్త వ్యూహం అల్లారు. ఈ వ్యూహంతో “ముందు మా అల్లు అర్జున్ రికార్డ్స్ కొట్టి మాట్లాడండి” అంటూ తొడలు కొట్టే మెగాఫ్యాన్స్ ఉత్సాహం కాస్తా చచ్చిపోయినా, మిగతా ఫ్యాన్స్ సపోర్ట్ ఫుల్‌గా అల్లు అర్జున్‌కి వచ్చేసింది.

తన మొదటి సినిమా హృదయ కాలేయం సినిమాతో సోషల్ నెట్‌వర్కింగ్‌లో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన సంపూకు అల్లు ఫ్యామిలీ వారి వ్యూహం బాగా నచ్చింది. హృదయ కాలేయం తర్వాత ఆ బ్యానర్లో వస్తున్న కొబ్బరిమట్ట సినిమాకు అందరి హిరోల అభిమానుల సపోర్ట్ కావాలని అంటున్నాడు. మెగా హిరో సాయిధర్మ్‌తేజ్ చేత టీజర్ రిలీజ్ చేయించుకుంటున్నాడు. సాయిధర్మ్‌తేజ్ తో పాటు కల్యాణ్‌రామ్ & సుధీర్‌బాబులను కూడా పిలిస్తే బాగుండేది. బహుశా ఆడియో రిలీజ్ వాళ్ళ చేత చేయిస్తాడెమో.

bottomline:
అక్కినేని ఫ్యాన్స్, మెగాఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్, సూపర్‌స్టార్ ఫ్యాన్స్ అంటూ తమ తమ ఫ్యామిలీ ఫ్యాన్స్ అంటూ లేని ప్రేమను ఒలకబోస్తున్న హిరోలందరూ, సినిమా అనేది అందరూ చూస్తేనే బ్లాక్‌బస్టర్ అవుతుందనే నిజం తెలుసుకొని, సంపూ మాదిరి అల్లు ఫ్యామిలీ వ్యూహాన్ని ఫాలో అవ్వాలి.

Filed Under: Extended Family

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *