సర్దార్ గబ్బర్‌సింగ్ మరో బద్రి

SGS

బద్రి, గుడుంబా శంకర్ & సర్దార్ గబ్బర్‌సింగ్, ఈ మూడు సినిమాలు ఒక కోవలోకి వస్తాయి.. ఒకటే తేడా ఏమిటంటే, సర్దార్ గబ్బర్‌సింగ్‌కు కథ పవన్‌కల్యాణ్ అందించాడు.

  1. బద్రి సినిమాపై చాలా ఎక్సపేటేషన్స్ వుండేవి. బద్రి పాటలు తమ్ముడు పాటల కంటే బాగున్నా, ఇంకా ఎక్సపెట్ చెయ్యడం వలన తమ్ముడు సినిమా అంత లేవు అనే టాక్ వచ్చింది. బద్రి సినిమా హిట్ అయ్యాక పాటలు హిట్ అయ్యాయి. ఆడియో పరంగా “జల్సా > గబ్బర్‌సింగ్ > అత్తారింటికి దారేది > సర్దార్ గబ్బర్‌సింగ్” అని ఫ్యాన్స్ ఫిల్స్ అయిపొయారు.
  2. బద్రి కథను పవన్‌కల్యాణ్, సర్దార్ గబ్బర్‌సింగ్ కథను ఎలా ఓన్ చేసుకున్నాడో అలానే ఓన్ చేసుకొని సినిమా చేసాడు. బద్రి, సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాల డైరక్టర్స్ పని డైరక్షన్ చెయ్యడం మాత్రమే. మిగతా పనంతా పవన్‌కల్యాణ్‌దే.
  3. “సర్దార్ గబ్బర్‌సింగ్” హై ఎక్సపెటేషన్స్ వలన ట్రైలర్ ఎక్సపెటేషన్స్ రీచ్ కాలేదు. రొటీన్ కథ అనే ఫీలింగ్ వచ్చింది. బద్రి సినిమా హిట్ అవ్వుద్దని పవన్‌కల్యాణ్ ఎంతగా నమ్మాడో, ఈ సినిమా కూడా ప్రేక్షకులను రంజింపజేస్తుందని నమ్ముతున్నాడు.

ఫ్యాన్స్ భయం:
బద్రి సినిమా ఫ్లాప్ టాక్‌తో మొదలయ్యి, కొన్ని రోజులకు పికప్ అయ్యింది. రీ ఎడిటింగ్ కూడా చేసినట్టు వున్నారు. ఇప్పుడు రోజులు అలా లేవు. సోషల్ నెట్‌వర్కింగ్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. కొద్దిగా తేడాగా వున్నా, నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయిపోతుంది. గబ్బర్‌సింగ్-1 వచ్చినప్పుడు పవన్‌కల్యాన్‌పై సానుభూతి వుండేది. వివిధ కారణల వలన ఇప్పుడు చాలా మందికి పవన్‌కల్యాణ్ మీద పీకల దాకా కోపం వుంది. నిజానికి ట్రైలర్ రైట్ ఎక్సపెటేషన్స్ సెట్ చెయ్యడానికి కట్ చేస్తే, గుండెల మీద చెయ్యివేసుకొని హిట్ అనేలా లేదని ఫ్యాన్స్ భయపడుతున్నారు.

Filed Under: Featuredసర్దార్ గబ్బర్‌సింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *