రిలీజ్ డేట్‌తో ‘అత్తారింటికి దారేది’ రెండో ట్రైలర్

Pawan Kalyan

రాష్ట్ర విభజన అంశం ఇప్పట్లో తేలే అవకాశం లేకుండా పోయింది. “అత్తారింటికి దారేది” సినిమా రిలీజ్ ఎప్పుడనేది పెద్ద ప్రశ్నగా మారింది.

ప్రజల స్టేబుల్ మూడ్ కోసం ఇంకా ఎన్ని రోజులని ఎదురు చూస్తారు? కాంప్రమైజ్ అయ్యి కచ్చితంగా అక్టోబర్ మొదటి వారంలో రిలీజ్ చెయ్యడం ఖాయం అని చాలా మంది భావిస్తున్నారు.

వాళ్ళ భావనతో పవన్‌కల్యాణ్ కూడా అంగీకరిస్తే రిలీజ్ డేట్‌తో ‘అత్తారింటికి దారేది’ రెండో ట్రైలర్ రావచ్చు.

ఎన్టీఆర్‌ ‘రామయ్య వస్తావయ్యా’ చిత్రాన్ని అక్టోబర్‌ 11న రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. so, ‘అత్తారింటికి దారేది’ అక్టోబర్‌ 2న గాంధీ జయంతి రోజు or అక్టోబర్‌ 4న(week-end) వుండవచ్చని అనుకుంటున్నారు.

రాష్ట్రం అంతా గజిబిజి గందరగోళంగా వుండటంతో సినిమా మూడే రావడం లేదు. పెద్ద సినిమా ఒకలాంటి పండగ వాతావరణం క్రియేట్ అయ్యేది. రెండు భారీ సినిమాలు వస్తున్నా, ఫ్యాన్స్ లో చిన్న హాడావుడి తప్ప, రెగ్యులర్‌గా వుండే పండగ వాతావరణం కనిపించడం లేదు.

Filed Under: Pawan KalyanFeatured