ట్రైలర్ & ఆడియో పబ్లిక్ టాక్

SGS

పబ్లిక్ టాక్: ఆడియో బిలో ఎవరేజ్ అని అంటున్నారు. ట్రైలర్ కిక్-2 లా వుంది అంటున్నారు.

హైప్ లేదు హైప్ లేదు అనుకుంటా వుంటే, పవన్ ఫ్యాన్స్ పవర్ ఏమిటో చూపించి ఒక్కసారిగా వేరే సినిమాలన్నింటినీ కొన్నిరోజులు మర్చిపొయేలా చేసారు. ట్రైలర్ గబ్బర్‌సింగ్-1 రేంజ్‌లో లేకపొయేసరికి హైప్ కొద్దిగా చల్లబడింది. సినిమా రిలీజ్ టైంకు మళ్ళీ ఊపందుకుంటుందనుకోండి. సినిమా బ్యాక్ డ్రాప్ మన తెలుగు బోర్డర్ కాబట్టి, తెలుగుదనం తక్కువైంది. రవితేజ కిక్-2 కూడా అదే బ్యాక్‌డ్రాప్ తో వుంటుంది. మహేష్‌బాబు ఖలేజ కూడా అదే బ్యాక్‌డ్రాప్. ఇలా ఫ్లాప్ సినిమాలు గుర్తుకు వచ్చే విధంగా ట్రైలర్ వుండేసరికి సినిమా మీద వచ్చిన హైప్ కొద్దిగా చల్లారింది. ఆడియో మీద హై ఎక్సపెటేషన్స్ వుండటం, దానికి తగ్గట్టుగా లేకపొవడం కూడా మరో కారణం అనోచ్చు.

మోసం చెయ్యాలని ప్రయత్నం చెయ్యలేదు:
సినిమా ఏమిటో అదే చెప్పారు ట్రైలర్‌లో. పంజా సినిమా మాదిరి మోసం చెయ్యాలని ప్రయత్నం చెయ్యలేదు. సిరియస్ ఫిలిం కాని, గబ్బర్‌సింగ్ క్యారెక్టరైజేషన్‌తో పవన్‌కల్యాణ్ కామెడీ పండిస్తాడు. పాటలు పిక్చరైజేషన్ బాగుంటే, ఆటోమేటిక్‌గా హిట్ అయిపొతాయి.

bottomline:
“గబ్బర్‌సింగ్-1”.. “అత్తారింటికి దారేది” రేంజ్ సినిమా కాదు. కంటెంట్ & ఎంటర్‌టైన్‌మెంట్ వాటికంటే తక్కువే వుంటుందనే టాక్ నడుస్తుంది. బద్రి సినిమా రేంజ్ కావోచ్చు. పవన్‌కల్యాణ్ ప్రెజెన్స్ ఏ రేంజ్‌కు తీసుకెళుతుందో చూడాలి.

Filed Under: Featuredసర్దార్ గబ్బర్‌సింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *