‘Sir, fans kosam’

Share the joy
  •  
  •  
  •  
  •  

SGS

నేను .. నా ఇష్టం .. నేను నాలానే వుంటాను .. ఫాలో అయితే అవ్వండి, లేకపొతే దొబ్బేయండి ..

Hemanth Kumar C R ‏@crhemanth
“It’s easy to make #PawanKalyan do anything in a film. The code word you’ve to use is – ‘Sir, fans kosam’.” – @dirbobby #SardaarGabbarSingh

“నేను .. నా ఇష్టం .. నేను నాలానే వుంటాను .. ఫాలో అయితే అవ్వండి, లేకపొతే దొబ్బేయండి ..” అంటూ ఫాలోయర్స్‌ను సంపాదించుకొవడం, వాళ్ళను అలానే మెయింటేన్ చెయ్యడం చాలా కష్టమైన పని. అందరివల్లా సాధ్యం కాదు. అందరికీ సాధ్యం కాదు. కొందరికి మాత్రమే సాధ్యం అవుతుంది. కొందరు మాత్రమే అలా వుండగలరు. అందులో రాంగోపాలవర్మ ఒకరు.

ఒకప్పుడు పవన్‌కల్యాణ్ కూడా అలానే వుండేవాడు. ఆ attitude చూసే ఫ్యాన్స్ అయినవాళ్ళు చాలామంది వున్నారు. “జానీ” సినిమా ఆ విధంగానే తీయడంతో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. “గుడుంబా శంకర్” “బాలు” సినిమాలు కూడా కాంప్రమైజ్ అవ్వకుండా తీసినవే. ఆ తర్వాత సినిమాల మీద ఇంటరెస్ట్ కోల్పోయాడు. కేవలం స్టోరి లైను డైరక్టర్‌కు ఇచ్చి, సినిమా మొత్తం వాళ్లకే వదిలేసేవాడు. ఆ జర్నీలో తనవెంటే వున్న అభిమానులను, కేర్ చేయడం మొదలుపెట్టాడు. తీన్‌మార్ నుంచి మళ్ళీ ఇంటరెస్ట్ క్రియేట్ చేసుకొని, స్పెషల్ కేర్ తీసుకొవడం మొదలుపెట్టాడు.

కాకపొతే, ఇంకా పలానా సీను ఇంత సిల్లీగా ఎందుకు చెయ్యాలనే ఆలోచన వుంది. డైలాగ్స్ అలా ఎందుకు చెప్పాలనే అని ఆలోచన కూడా వుంది. ఫ్యాన్స్ కోసం, మాస్ ఆడియన్స్ కోసం తప్పదు అని తెలుసుకున్న పవన్, డైరక్టర్ కన్విన్స్ చేయగల్గితే, ఏమైనా చెయ్యడానికి వెనుకాడడు.

సినిమా తీసేది ప్రేక్షకుల కోసమే అయినపుడు వాళ్ళకోసం కాంప్రమైజ్ కావడంలో తప్పు లేదు. ఆ విషయం రాంగోపాలవర్మ కూడా తెలుసుకుంటే, రాంగోపాలవర్మ కూడా బాహుబలిని మించిన సినిమాలు తీయగలడు.

Filed Under: Featuredసర్దార్ గబ్బర్‌సింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *