S/O సత్యమూర్తి ఆడియో ఫంక్షన్ రివ్యూ

image

ఆడియో ఫంక్షన్‌తో కూడా సినిమాపై హైప్ క్రియేట్ అవుతుందని నిరూపించిన సినిమా “మగధీర”. ఆ సినిమా ఆడియో ఫంక్షన్ నుంచి పెద్ద హిరోలందరూ తమ సినిమా ఆడియో ఫంక్షన్స్ గ్రాండ్‌గా చేస్తూ, మాక్సిమమ్ హైప్ క్రియేట్ చెయ్యడానికి ప్రయత్నం చేస్తున్నారు.

  1. ‘అత్తారింటికి దారేది’ తర్వాత త్రివిక్రమ్ డైరక్షన్‌లో వస్తున్న సినిమా సత్యమూర్తి.
  2. ‘రేసుగుర్రం’ తర్వాత అల్లు అర్జున్ హిరోగా వస్తున్న సినిమా సత్యమూర్తి.
  3. ’జులాయి’ తర్వాత త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న సినిమా సత్యమూర్తి.

పై కారణాల వలన S/O సత్యమూర్తి కు హైప్ అవసరం లేదు, కాని పబ్లిసిటి అవసరం వుంది కాబట్టి, ఎదో కానిచ్చేసినట్టు వున్నారు..

  1. దాసరి ముఖ్య అతిధి కావడంతో మెగా అభిమానులు నిరుత్సాహానికి గురి అయ్యారు. అందుకు తగ్గట్టుగానే ఎన్.టి.ఆర్, ఎ.ఎన్.ఆర్ అంటూ చిరంజీవిని స్కిప్ చేసి పవన్‌కల్యాణ్ & అల్లు అర్జున్ అని అంటూ మరోసారి తనకు ఇచ్చే గౌరవాన్ని తనే తగ్గించుకున్నాడు. చిరంజీవి పేరు లేకుండా టాలీవుడ్ చరిత్ర వుంటుందా?
  2. పవన్‌కల్యాణ్ రాకపొవడంతో త్రివిక్రమ్ డల్ గా కనిపించాడు.
  3. దేవిశ్రీ ప్రసాద్ తన పెరఫార్మన్స్‌తో అందరిలోనూ ఉత్సాహం నింపాడు.
  4. అల్లు అరవింద్ స్పీచ్‌తో త్రివిక్రమ్‌పై తనకు గల అభిమానాన్ని పబ్లిక్‌గా చాటుకొవడానికి ఈ వేదికను వాడుకున్నాడు.
  5. చిరంజీవి పేరు చెప్పలేదని బన్నీకి కూడా మైండ్ బ్లాక్ అయినట్టు వుంది. వీరిని ఎందుకు పిలిచాం రా అని స్టేజి మీద మొహం మాడ్చుకొని, స్పీచ్ తడబడుతూ ఎదో \కానిచ్చేసాడు.

Filed Under: Mega FamilyFeaturedTeluguసత్యమూర్తి గారి అబ్బాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *