సన్నాఫ్ సత్యమూర్తి లోగో రిలీజ్

son_of_satyamurthy logo

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ & స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘సన్ అఫ్ సత్యమూర్తి’. షూటింగ్ చివరి దశలో ఉంది. ఒక్క పాట మినహా మిగతా షూటింగ్ అంతా పూర్తయ్యింది. ఏప్రిల్ 2న ఈ సినిమాని & మార్చి 15న ఈ సినిమా ఆడియోని లాంచ్ చేయనున్నారు. ఈ సినిమా రిలీజ్ కి సమయం ఆసన్నమవుతుండడంతో ఈ చిత్ర టీం ఈ సినిమాకి సంబందించిన ప్రమోషన్స్ మొదలు పెట్టారు. అందులో భాగంగా మొన్న ప్రీ రిలీజ్ ఫస్ట్ లుక్ పోస్టర్, నిన్నేమో ప్రీ రిలీజ్ ఫస్ట్ లుక్ టీజర్ అని రిలీజ్ చేసారు. ఈ ఫస్ట్ టీజర్ లో సినిమాలోని అన్ని పాత్రలని పరిచయం చేసారు. ఈ టీజర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. సరికొత్త రీతిలో త్రివిక్రమ్ పాత్రలని పరిచయం చేయడం అందరినీ ఆకట్టుకుంది. అలాగే దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మరింత అట్రాక్ట్ చేస్తోంది.

ఈరోజు సన్నాఫ్ సత్యమూర్తి లోగో రిలీజ్ చేసారు. ప్రీ రిలీజ్ ఫస్ట్ లుక్ పోస్టర్ & ప్రీ రిలీజ్ ఫస్ట్ లుక్ టీజర్ మాదిరే లోగో కూడా ఇండస్ట్రీ హిట్ రేంజ్‌లో వుంది.

పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రానున్న ఇందులో ఉపేంద్ర, రాజేంద్ర ప్రసాద్, స్నేహలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తాయని ఈ చిత్ర టీం అంటోంది. అల్లు అర్జున్ సరసన సమంత, ఆద శర్మ, నిత్యా మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Filed Under: Mega FamilyTeluguసత్యమూర్తి గారి అబ్బాయి