S/o Satyamurthi Songs List

Bunny5

అల్లు అర్జున్,హిరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తాజాగా ఏప్రిల్ మొదటి వారంలో మన ముందుకు వస్తున్న చిత్రం ‘ s/o స‌త్య‌మూర్తి’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ఇక ఈ చిత్రంలో సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్. కన్నడ స్టార్ ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ కీలక పాత్రలు పోషించారు. ఇతర పాత్రల్లో సింధుతులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం,రావ్ రమేష్ నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆడియో విడుదలను రేపు (మార్చి 15) రాత్రి హైద్రాబాద్‌లోని నోవాటెల్‌లో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకకు సినిమా యూనిట్ మొత్తం హాజరయ్యేలా ప్లాన్ చేశారు. ముఖ్య అతిధులు ఎవరనేది ఇంకా తెలియదు అనుకుంట.

ఆడియో సి.డి లో 7 సాంగ్స్ వున్నాయి.

  1. చలో చలో చలో
  2. ఒన్ & టు & త్రీ
  3. శీతాకాలం
  4. సూపర్ మాచి
  5. కమ్ టు ది పార్టీ
  6. జారుకో
  7. వచ్చాడు

Filed Under: Mega FamilyFeaturedTeluguసత్యమూర్తి గారి అబ్బాయి