శ్రీమంతుడు కంటెంట్ బాహుబలి కంటే బెటర్ వుంటుంది

Srimanthudu

ప్రస్తుతం బాహుబలి సినిమాను ప్రస్తావించకుండా మాట్లాడలేము. రాజమౌళి తన హార్డ్‌వర్క్‌తో బాహుబలి సినిమా కచ్చితంగా థియేటర్లో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చూడాలి అని తెలుగు ప్రేక్షకుల మనసుల్లో నాటేసాడు. రాజమౌళి వ్యూహం బాగా సక్సస్ అయ్యింది. కలక్షన్స్ సునామీ సృష్టిస్తుంది.స్లోగా సినిమాలోని క్యారెక్టర్స్ కూడా ప్రేక్షకుల్లోకి చొచ్చుకొని పోతున్నాయి.

రాజమౌళికి ప్రేక్షకుల నాడి బాగా తెలుసు. మగధీరతో యూనివర్సల్ acceptanace వచ్చింది. ఇప్పుడు బాహుబలితో కమర్షియల్ డైరక్టర్‌గా ఎవరికి అందనంత ఎత్తుకు ఎదిగిపొయాడు. కంటెంట్ పరంగా మనకు చాలా మంది మంచి రైటర్-దర్శకులు వున్నారు. అందులో కొరటాల శివ ఒకడు.

ఓవరాల్ కలక్షన్స్ మరో పదేళ్ళు పదిలం. కొడితే next రాజమౌళి సినిమానే కొట్టాలి.

  1. ఇండియాలో తెలుగు కలక్షన్స్
  2. ఓవర్‌సీస్ తెలుగు కలక్షన్స్
  3. వేరే బాషల్లోని కలక్షన్స్

ఇండియాలో తెలుగు కలక్షన్స్ పెద్ద హిరో నుంచి మాస్ సినిమా వస్తే కొట్టేయవచ్చు. ఓవర్‌సీస్ తెలుగు కలక్షన్స్, ఇంతలో కష్టమే. వేరే బాషల్లోని కలక్షన్స్ ఇంపాజిబుల్.

శ్రీమంతుడు కంటెంట్ బాహుబలి కంటే బెటర్ వుంటుంది.
బాహుబలి ఏ విధంగా చూసినా ఎవరేజ్ సినిమా. కథ కూడా మధ్యలో ఆపేసాడు. అధ్భుతమైన విజువల్స్‌తో పాటు పేలవమైన సన్నివేశాలు ఎన్నో. పెరఫార్మన్స్ పరంగా హిరోను అసలు వాడుకోలేదు. ఏ కోణంలో చూసుకున్నా శ్రీమంతుడు బాహుబలి కంటే బెటర్ వుండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఓవర్‌సీస్ లో మహేష్‌బాబు కింగ్ అయినా బాహుబలి కలక్షన్స్‌లో సగం వస్తే గొప్ప అంటున్నారు. సినిమాను హైప్ చేయగల్గితే, ఇండియాలో తెలుగు కలక్షన్స్ బ్రేక్ చెయ్యడం అంత కష్టం ఏమీ కాదు.

దర్శకుడు కొరటాల శివ అదిరిపొయే మాస్ డైలాగ్స్ వ్రాయడంలో దిట్ట. దర్శకుడిగా కూడా సూపర్ సక్సస్ సాధించాడు. మహేష్‌బాబు ఇమేజ్‌కు తగ్గ కథే వ్రాసి వుంటాడు.

bottomline:
బాహుబలి కలక్షన్స్ చూసి శ్రీమంతుడుని తక్కువ అంచనా వేయవద్దు.

Filed Under: Featuredశ్రీమంతుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *