Mr. PK మార్చి 1న విడుదల

sunil_isha_chawla_chiranjeevi

మా ‘మిస్టర్ పెళ్లికొడుకు’కి క్లీన్ యు సర్టిఫికెట్ వచ్చింది. మార్చి 1న విడుదల చేస్తున్నాం.

— నిర్మాత ఎన్వీప్రసాద్

సునీల్, ఇషాచావ్లా జంటగా నటించిన చిత్రం ‘మిస్టర్ పెళ్లికొడుకు’. మార్చి 1న విడుదల అవుతుంది. ఇంకా ముందే రిలీజ్ అవ్వాలి కాని, వేరే సినిమాలతో పోటి పడటం ఇష్టం లేక ఇప్పుడు రిలీజ్ అవుతుంది. లాస్ట్ ఇయర్ వచ్చిన సునీల్ ‘పూల రంగడు’ సినిమాలో కూడా సునీల్ సరసన ఇషా చావ్లా నే నటించింది.

పవన్ కళ్యాన్ తో ‘సుస్వాగతం’ & ‘అన్నవరం’, రామ్ చరణ్ తో లాస్ట్ ఇయర్ ‘రచ్చ’ సినిమా నిర్మించిన మెగా సూపర్‌గుడ్ ఫిలిమ్స్ ప్రై. లిమిటెడ్ నిర్మిస్తోంది. ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్ నిర్మాతలు. ఆర్.బి.చౌదరి సమర్పిస్తున్నారు. సి.దేవిప్రసాద్ దర్శకుడు.

పవన్ కళ్యాణ్ ‘తమ్ముడు’ ‘గబ్బర్ సింగ్’ సినిమా హిందీ సినిమాల రిమేక్స్ అయినా పవన్ కళ్యాణ్ & తెలుగు ప్రేక్షకుల కోసం భారీ మార్పులు చేసారు. అదే స్టైల్లో హిందీ సినిమా ‘తను వెడ్స్ మను’ కు మార్పులు చేసి ‘మిస్టర్ పెళ్ళికొడుకు’ తీసారు.

Filed Under: Extended FamilyFeatured