సుప్రీమ్ పబ్లిసిటీ అదిరింది

Supreme

ఏ సినిమా అయినా ఒక నమ్మకంతో చేస్తారు. ఏ నమ్మకంతో సినిమా చేసారో సినిమా రిలీజ్‌కు ముందు ప్రేక్షకులకు తెలియాలి. అది పబ్లిసిటి. పబ్లిసిటీతో హైప్ కూడా అవసరం. మేకర్స్ నమ్మకంతో ప్రేక్షకులు ఏకీభవిస్తే సినిమా హిట్ అవుద్ది. భారీ కలక్షన్స్ కావాలంటే హైప్ అవసరం. సినిమా అటూ ఇటూ అయితే, సినిమా మీద వున్న హైప్ దూల తీర్చేస్తుంది. అది వేరే విషయం.

“సుప్రీమ్” సినిమా మీద “సుబ్రమణ్యం ఫర్ సేల్” సినిమా మీద వున్నంత హైప్ లేదు. పబ్లిసిటీ కూడా సరిగ్గా చేయలేకపొయారు. కారణం సర్దార్ గబ్బర్‌సింగ్ & సరైనోడు.

సర్దార్ గబ్బర్‌సింగ్ డిజాస్టర్ అయ్వడంతో మెగాభిమానుల్లో ఉత్సాహం తగ్గింది. అలా పోయిన ఉత్సహాన్ని సరైనోడు కొద్దిగా తెచ్చిపెట్టింది అనోచ్చు. నిజానికి ఇంకోవారం గ్యాప్ ఇచ్చి రిలీజ్ చేసి వుంటే బాగుండేది. కాని వేరే పెద్ద సినిమాలు లైనులో వుండటంతో మే 5నే వచ్చేస్తున్నట్టు వుంది.

సినిమా పబ్లిసిటీ కోసం ఇంత రిస్క్ తీసుకొని జనాల్లోకి వెళ్ళడం అంటే మాటలు కాదు. జంగారెడ్డి గూడెం లో ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని, ఆ తరువాత రాజేశ్వరి ధియేటర్ లో ఫాన్స్ ను కలుసుకున్న సుప్రీమ్ యూనిట్, అక్కడ స్పెషల్ గా ‘టాక్సీ వాలా’ పాటను ప్రదర్శించారు. రిలీజ్ కి ముందే ఇలా ఒక పాటను కొంతమందికి మాత్రమే ప్రదర్శించటం ఒక మంచి ఐడియా అని చెప్పవచ్చు.

Filed Under: Featuredసుప్రీమ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *