SVSC exclusive review

Mahesh Babu, Venkatesh in SVSC Movie Posters

సినిమా ఎలా వుంది?
వివిధ కారణాల వలన ‘నాయక్’ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా ప్రిమియర్ షోస్ మిస్ అయ్యాను. మిస్ అయ్యినందుకు చాలా బాదగా అనిపిస్తుంది.

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా విషయానికి వస్తే, సినిమా చూస్తున్న ఫీలింగ్ లేదు. కళ్ళ ముందు జరుగుతున్నట్టే వుంది. బహుశా బాగా కనెక్ట్ అవ్వడం వలనెమో. ఫుల్ మార్క్స్ టు దిల్ రాజు, శ్రీకాంత్ అడ్డాల, ప్రకాష్ రాజ్, వెంకటేష్, మహేష్ బాబు, అంజలి, రావు రమేష్ .. ఎవరు కాదు, ఈ సినిమాకు పని చేసిన వాళ్ళందరికీ.

డబ్బుల కంటే ముందు, ప్రేక్షకులకు ఒక మంచి సినిమా అందించాలనుకునే దిల్ రాజు, ఇదే కమిట్ మెంట్ తో మరిన్ని విజయాలతో, మరిన్ని చిత్రాలు అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ, బిగ్ థాంక్స్ టు దిల్ రాజు for the wonderful movie.

కథ-డైరక్షన్ ఎలా వుంది?
శేఖర్ కమ్ముల & క్రిష్ లాంటి దర్శకులు మేము చాలా honest గా సినిమాలు చేసాం అని పబ్లిసిటిలో భాగంగా ఉదరగోట్టేస్తూ వుంటారు. వాళ్ళు పెట్టిన పెట్టుబడికి డబ్బులు రావాలని కూడా ఈక్వల్ గా ఆలోచించడం వలన, వాళ్ళ honest attempts లో తేడా జరుగుతున్నట్టుగా వుంది.

but this film, దిల్ రాజు, మహేష్ బాబు, వెంకటేష్ ఇచ్చిన సపోర్ట్ తో శ్రీకాంత్ అడ్డాల చేసిన honest attempt అనిపించింది.

వెంకటేష్ ఎలా చేసాడు?
వెంకటేష్ ఒక్కడే కాదు, ప్రతి ఒక్కరూ ఎక్సలెంట్.

మహేష్ బాబు ఎలా చేసాడు?
ఖలేజ సినిమా నుంచి మంచి వరస కుదిరింది. జనాలను థియేటర్స్ కు రప్పించడం దగ్గర నుండి, సినిమాలో సందడితో పాటు, లక్ష్మణుడి పాత్రలో సూపర్భ్.

Filed Under: Hari Reviews