Talk of the Town – రాజమౌళి

Ramayya-Vasthavayya

ఒక పక్క రాజమౌళిని పొగుడుతున్నారు, మరో పక్క ఛాన్స్ వస్తే విమర్శలతో కుమ్మేయ్యడానికి రెడిగా వున్నారు. ఎందుకంటే ఒక్కొక్కడికి ఒక్కో రీజన్. ఎవడైనా బాహుబలిపై ఒక్క పైసా పెట్టుబడి పెట్టారా అంటే, లేదు.

పూరి జగన్నాధ్ తక్కువ రోజుల్లో తీస్తే, చుట్టిపాడేస్తున్నాడు అని విమర్శలు చేస్తారు. ప్రేక్షకులు కోరుకునేది తీస్తే, రోటిన్ అంటారు. మూడు సంవత్సరాలు రేయింబవళ్ళు కష్టపడి తీస్తే, తెలుగుసినిమాకు అంత ఖర్చు అవసరమా? అన్ని రోజులు షూటింగ్ ఏమిటి? అని విమర్శలు చేస్తారు.

సినిమాను ఎన్ని రోజులు తీసారు? ఎంత ఖర్చు పెట్టి తీసారు? మనకి అవసరమా? … ఎదో పబ్లిసిటి కోసం దర్శక నిర్మాతలు అంతని ఇంతని చెప్పుకుంటారు.

s/o సత్యమూర్తి “రేసుగుర్రం” “అత్తారింటికి దారేది” రేంజ్‌లో లేని మాట వాస్తవం. భారీ తారాగాణానికి తగ్గ రేంజ్‌లో సినిమా లేని మాట కూడా వాస్తవమే. కాని తీసిపాడేసే సినిమా కాదు. హాయిగా ఎన్ని సార్లైనా చూడవచ్చు. కాని ఆ సినిమాలో ఏముంది అనే వాళ్ళే తప్ప, అంతకు మించి ఏమి తీయగలరని అనే వాళ్ళు లేరు. కారణం 1) ఆ సినిమాపై పెట్టుకున్న ఆశలు 2) బన్నీ & త్రివిక్రమ్ సక్సస్‌పై వున్న ఈర్ష్య.

ఇప్పుడు ఇంచుమించు అదే సిట్యూవేషన్‌లో బాహుబలి రిలీజ్ కాబోతుంది. 1) భారీ ఎక్సపెటేషన్స్ 2) రాజమౌళి సక్సస్‌పై కుళ్ళు

ఈ రెండిటికి తోడు .. మహేష్‌బాబు “శ్రీమంతుడు” పోటి.

ఈ మూడు ఆటుపోట్లు తట్టుకొని, తెలుగు వర్షన్‌లో వంద కోట్లు షేర్ సాధించే మొట్టమొదటి తెలుగు సినిమా “బాహుబలి” అవుతుందా?

Filed Under: Featuredబాహుబలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *