మెగా సినిమాలపై తెలంగాణ ఎనౌన్స్ మెంట్ ప్రభావం

andhra-pradesh-map

ఇదిగో తెలంగాణ .. అదిగో తెలంగాణ .. వారం రోజుల్లో తెలంగాణ .. నెల రోజుల్లో తెలంగాణ .. అంటూ తెలంగాణ ప్రజలను ఈ రాజకీయ నాయకులు మభ్య పెడుతూనే వున్నారు.

అభివృద్ధి చెందిన హైదరాబాద్ మీ ప్రాంతంలో పెట్టుకొని మేము విడిపొతాం అనటం ఎంత వరకు సమంజసం? మీరు డామ్లు కడితే మాకు నీరు వస్తుందా? అనే ప్రశ్నలు ఆంధ్ర ప్రజల మనస్సుల్లో వున్నాయి. విడిపొండి అని ఎన్ని పచ్చి బూతులు తిడుతున్నా దిక్కులేక “సమైక్యమే ముద్దు” అని సీమాంధ్ర ప్రజలు అంటున్నారు. దాని అర్దం కలిసుందాం అని కాదు, అనూహ్యంగా అభివృద్ధి చెందిన హైదరాబాద్ లో మాకూ భాగస్వామ్యం వుందని.

అందరిని సంతృప్తి పరచడం కష్టం కాబట్టి, ఏదైతే అది అయ్యింది .. ఏదో ఒక డెసిషన్ తీసుకొని ఒక వర్గాన్ని పూర్తిగా బలవంతంగా నైనా అణచవలసిన బాద్యత కేంద్రంపై వుంది. కాని, సమస్య సృష్టించిందే రాజకీయంగా బలపడటానికి. అంత తేలిగ్గా తెగనిస్తారనుకుంటే పొరబాటే.

ఒక సమస్యను తప్పు ద్రోవ పట్టించడానికి మరో సమస్యను క్రియేట్ చెయ్యడానికి కేంద్రం సిద్దం అవుతుందని మీడియా హడావుడి చేస్తుంది.

దీనిప్రభావం మెగా సినిమాలపై పడే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. వారం రోజుల్లో రెండు మెగా సినిమాలు, ఆ కిక్కే వేరు అనుకుంటున్న అభిమానులు, ఎక్కడ పోస్ట్ పోన్ వార్తలు వినవలసి వస్తుందో అని బెంగ పెట్టుకున్నారు. అభిమానుల బెంగ పక్కన పెడితే, “ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలియక, ఇటువంటి సమయంలో రిలీజ్ అయితే కలక్షన్స్ వుంటాయా” అని ఈ సినిమాలపై పెట్టుబడి దారులకు పెద్ద టెన్షన్.

Filed Under: Mega FamilyFeatured