terrific 1st LOOK (photos)

ram-charan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రస్తుతం ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామేశ్వరంలో జరుగుతోంది. రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో, రామ్‌చరణ్ కు అన్నయ్యగా నటిస్తున్న శ్రీ కాంత్ కి జోడీగా కమలినీ ముఖర్జీ కనిపించనుంది. థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమా పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది.

SKN ‏@SKNonline Feb 21
#MegaPowerStar #RamCharan #KrishnaVamshi @ganeshbandla’s mega film’s terrific 1st LOOK (photos) on 27th March as Charan B day spl Get Ready

దర్శకుడు కృష్ణవంశీకి బ్యాడ్ టైమ్ నడుస్తున్న మాట వాస్తవం. రామ్‌చరణ్-కృష్ణవంశీ సినిమా అంటే ముందుగా మాట్లాడుకోవల్సింది కృష్ణవంశీ గురించే. కారణం ప్రేక్షకులకు ఆయన సినిమాల్లో ఎదో వుంటుందన్న ఆశ ఇంకా మిగిలేవుంది.. చివరికి ప్రేక్షకులు ఆశీంచేది లేకపొవడంతో ఆయన సినిమాలకు ఓపినింగ్స్ వుంటున్నాయి కాని, లాంగ్ రన్ or స్టడీ రన్ వుండటం లేదు. రామ్‌చరణ్ హిరో కాబట్టి, ఈసారి మిస్ అవ్వడని ఒక నమ్మకం యాడ్ అయ్యింది.

రచ్చ, నాయక్, ఎవడు — భారీ కమర్షియల్ హిట్స్. కాని ఆ సినిమాల టార్గెట్ మాస్‌కే పరిమితం కావడంతో, ఈ సినిమాలపై సినిమాకు ముందు భారీగా అంచనాలు లేవు. కాని ఇప్పుడు కృష్ణవంశీ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. బండ్ల గణేష్ నిర్మాత కాబట్టి, ఈ అంచనాలను మరింత పెంచే పనిలో పడ్డాడు. రామ్‌చరణ్ పుట్టినరోజు మార్చి 27 సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నాడు. good job!

Filed Under: Mega FamilyFeatured