Thanks To Allu Arjun

AA

నాగేంద్రబాబు & అల్లు అర్జున్,

2003 లో, ఈ విడియో చూడండి. చిరంజీవి ఎంత ఉత్సాహంగా తమ్ముడు గురించి చెప్పాడో .. అప్పుడు అవమానంగా ఫీల్ అవ్వనది ఇప్పుడు అవమానంగా ఎందుకు ఫీల్ అవుతున్నారు?

Thanks To Allu Arjun:
తనంతట తాను క్రియేట్ చేసుకొని, చివరికి మెగాఫ్యాన్స్ మీదకు తోసేసిన కాంట్రవర్సీకి, సాగతీయకుండా ముగింపు ఇచ్చినందుకు Thanks To Allu Arjun. మెగాఫ్యాన్స్ మెగా హిరోలను అవమానించాలనుకుంటారు అనుకోవడం అనేది చాలా పెద్ద తప్పు. అలా అని మీరు ఊహించుకుంటున్నారు.

1) చిరంజీవిని అవమానించాలనుకునే వాడు మెగాఫ్యానే కాదు. 2) చిరంజీవినే కాదు, ఏ హిరోను అవమానించాలనుకునే వాడు నిజమైన పవన్‌కల్యాణ్ ఫ్యానే కాదు.

మైకు పట్టుకొని స్టేజి మీద మాట్లాడే అవకాశం వచ్చిందంటే, నార్మల్ జనాలతో పోల్చుకుంటే ఎంతో కొంత సాధించారని అర్దం. ఒక బాద్యతతో వ్యవహరించాలి. ఎంతో టైం వెచ్చించి అక్కడకు వచ్చిన అభిమానులకు కావల్సింది ఇవ్వవలసిన బాద్యత వుంది. పబ్లిక్ ఫంక్షన్ అంటే, గోల సహజం. సున్నితంగా చెప్పాలి. రిక్వెస్ట్ చెయ్యాలి. అది పెద్దవాళ్ళ బాద్యత. ఇంకా వినకపొతే మాట్లాడటం మానేయ్యాలి. అదే పెద్ద పనిష్‌మెంట్. ఫంక్షన్‌కు వచ్చిన వాళ్లను బానిసలకంటే హీనంగా అవమానించడం కచ్చితంగా పెద్ద తప్పు. అది నాగేంద్రబాబు అయినా, అల్లు అర్జున్ అయినా.

చిరంజీవిగారి కోసమే అన్నది పెద్ద అబద్దం:
ఎదో అల్లు అర్జున్ ఆడియో ఫంక్షన్‌లో చిరంజీవి పేరును కావాలని మిస్ చేసిన దాసరిని, అదే ఫంక్షన్‌లో ఎటాక్ చేసి వుంటే, చిరంజీవి గారికి అల్లు అర్జున్ ఇచ్చే గౌరవం ఏమిటో తెలిసేది. “చిరంజీవిగారికి జరుగుతున్న అవమానం తట్టుకొలేకే ఇలా ప్రవర్తించాను. నేను వివరణ ఇచ్చే లోపే మీడియా చేసిన దుష్పాచారంతో ఇప్పుడు ఇస్తున్నాను” అనేది పెద్ద అబద్దం. ఇంకా సరైనోడు క్యారెక్టర్‌లోనే వుండి బలుపుతో చేసిన యాక్షన్స్ అవి అని అందరికీ అనిపించింది. గోల చేసే అభిమానులదే తప్పు అంటూ వివరణ ఇచ్చినంత మాత్రానా నిజం అయిపోదు.

పవన్‌కల్యాణ్ అంటే వెర్రి. పవన్‌కల్యాణ్‌కు డబ్బులిచ్చి సంపాదించుకున్న అభిమానులు లేరు. అందరూ భక్తులే. ఇది నిజం. అటువంటి భక్తులను సంపాదించుకొవాలంటే పెట్టి పుట్టాలి. ప్రతి హిరోకు హైపర్ ఫ్యాన్స్‌ వుంటారు. పవన్‌కల్యాణ్‌కు కొద్దిగా ఎక్కువ. అది ఒక వరం. వాళ్ళ హైపర్‌ను చంపాలనుకొవడం మంచిదే కాని, మనకు లేరని వాళ్ళ హైపర్‌ను చంపాలనుకొవడం తప్పు.

ధైర్యం అంటే ఇది. రియల్ దమ్ము అంటే ఇది. అన్నయ్య మీద ప్రేమ అంటే ఇది. గోల చేసే ఫ్యాన్స్‌ను బ్లేమ్ చెయ్యడం కాదు. అన్నయ్యని వెటకారం చేసినోడిని అక్కడే అదే స్థాయిలో తిరిగి వెటకారం చెయ్యడం. అన్నయ్య మీద ప్రేమ ఇప్పుడు తగ్గిందని అనుకొవద్దు. అప్పుడు ఫైర్‌తో చేసింది, ఇప్పుడు శాంతంతో చేస్తున్నాడు.

Note:
1) అల్లు అర్జున్‌ను అవమానించాలనో నాగేంద్రబాబును అవమానించాలనో వుద్దేశంతో వ్రాసింది కాదు. ఫ్యాన్స్‌ను పబ్లిక్ పంక్షన్స్‌లో అవమానించడం తప్పు. సముదాయించాలి. బ్రతిమాలాలి. చివరిగా అలగాలి. కావాలని రెచ్చగొట్టడం & అవమానించే విధంగా మాట్లాడం తప్పు అని చెప్పడమే వుద్దేశం. మీడియా పనే అసలు వుద్దేశం ఏమిటో ప్రజలకు చెప్పడం. వాళ్ళు అడిగితే వక్రీకరిస్తారని చెప్పలేదని అనటం మరో తప్పు.

2) అల్లు అర్జున్ ప్రవర్తించిన తీరును తప్పుగా అర్దం చేసుకొనుంటే, అల్లు అర్జున్‌కు క్షమాపణలు.

3) నాణెం రెండో సైడు కూడా తెలియాలి కదా అని స్పందించడం జరిగింది. అల్లు అర్జున్ చెప్పినట్టు ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయడం మంచిది.

Filed Under: Featuredసరైనోడు

commentscomments

 1. RK says:

  Well said hari garu. First please accept my appreciation for posting such a good article. Don’t say sorry to Mr. Allu Arjun. He didn’t deserve for sorry or thanks words.

  What you said is correct that intention behind “cheppanu brother” is not exactly the mega star.He used his name as a reason and blaming PSPK fans.PSPK fans never ever insulted chiranjeevi garu. PSPK himself is a big fan of Chiranjeevi garu (You have already posted video how PSPK responded on so called actor in public function).

  Mr. Allu arjun told that PSPK got this much stardom is only because of Chiranjeevi garu which is not at all true. As everyone know the fact that Megastar stardom will help for initial 2 to 3 films only. After that it depends on his own capability. PSPK unique selection of stories, unique style, Unique mannerisms, honesty (best quality in him) etc. went well into the hearts of PSPK fans.

  As you said, to get the devotees (PSPK have devotees rather than fans)one should have unique qualities like PSPK.PSPK fans are not the kids to learn the lessions from Mr. All Arjun.

  Mr. Allu arjun told that PSPK fans are disturbing other star heros functions which is not at all correct. Prabhas has attended the mega hero (Varun tej) audio function. Since it is a mega hero audio function, PSPK fans might have asked about PSPK. Nothing wrong in it.

  First time in Sarainodu vijaywada function, we (PSPK fans) thought that unintentionally he told “cheppanu brother”. But last sunday in eenadu newspaper, he told that he stood by that comment once again. Mr. Allu arjun hurted/poked the egos of the PSPK fans. All PSPK fans never ever forgive Mr. All arjun (still he is blaming/insulting PSPK fans in public function which was held on last night)

  As a PSPK fan, I support “Chusukuntam brother”.

 2. Pawan says:

  Hari and RK,

  As RK sir said, Allu Arjun never needed your Thanks/Sorry.

  “PSPK fans never ever insulted chiranjeevi garu”

  In the initial days of Janasena party, most of the Exclusive Pawan only fans, blasted Chiranjeevi like anything. May be you are not aware of the facts.

  Allu Arjun didn’t say that Pawan didn’t get his own fan following, he simply said that Megastar Chiranjeevi Annayya provided pavement for all Mega heroes.

  Prabhas has attended the mega hero (Varun tej) audio function. Me too agree with you.
  But it is Prabhas’s responsibility to speak about the persons who invited him to the function 1st. But Pawan only fans, didn’t give him chance to speak till he spoke about Powerstar.

  He said that he loved Powerstar. Do you think his words come from his heart?

  Let them speak by their own, don’t force them to speak.

  As Allu Arjun said those are simply Mechanical words.
  But your world truth and your EGO won’t allow you to belive this truth…

 3. Hari says:

  హైపర్ ఫ్యాన్స్ కంట్రోల్ చెయ్యడం కష్టం. ఇలా అవమానిస్తూ కంట్రోల్ చెయ్యాలనుకోవడం తప్పు. ఫంక్షన్ వాళ్ళను ఆనందపరచడానికే అంటారు. వాళ్ళ అరుపులు కావాలంటారు. వాళ్ళు అడిగిన చిన్న మాట చెప్పేస్తే పోయేదానికి, ఇలా పబ్లిక్‌గా వాళ్ళను అవమానిస్తే ఎలా?

  ప్రభాస్‌ను ఫోర్స్ చేసినా, పవన్‌కల్యాణ్ పెద్దోడే కదా, ఒక చిన్న మాట ” I like PowerStar” అని చెప్పాడు. అతని చెప్పింది నిజం కూడా. వాళ్ళు శత్రువులు కాదు కదా !!!

 4. Pawan says:

  Thank you Hari Sir. Finally you have accepted hyper fans forced Prabhas…

  I didn’t say Pawan & Prabhas are enemies.
  It’s my opinion that only 2 section of ppl are Pawan haters/anti fans.

  1. Caste based ppl
  2. Who feel Pawan as a competitor for their favourite Hero.

  Apart from those 2 section of ppl, everybody likes/loves POWERSTAR bcoz of his ATTITUDE.

  It’s not that much easy for any other Mega Hero including Charan to get devotees as Pawan Kalyan gets. Every Mega Hero also knows this universal fact. If anybody forgets this, it means he is digging his own grave.

  If you force me to speak, I will speak mechanically just to satisfy your shouts.

  But if you allow me to speak, I will share my feelings about a person from the bottom of my heart.

  Allu Arjun wants to convey the above message, but he did it in little bit aggressive manner. Anyway lets end this.

 5. Hari says:

  Pawan, got your point. I have missed caste angle

 6. subbu says:

  హాయ్,

  అల్లు అర్జున్ చెప్పిన విధానం బాగోలేదు బ్రదర్.
  హరి గారు చెప్పినట్టు ఇది ఛిరంజీవి గారి కోసం కుడా కాదు. మనం మరీ అంత అమాయకులం కాదు కద.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *