Thanks To TDP Media

Pawan Kalyan

Thanks To TDP Media. పవన్‌కల్యాణ్ ట్వీట్స్‌కు పెడర్దాలు తీయకుండా పవన్‌కల్యాణ్ ఆవేదనను కరెక్ట్‌గా ప్రచారం చేసారు.

ఒక వార్తను వంకరగా చెపితే కాని వినే స్థితిలో ప్రజలు లేరు. ఎంత వంకరగా చెప్పినా నిజాన్ని వక్రీకరించడం తప్పు. మీడియా కూడా ఎదో ఒక పార్టీకి చెందవలసిందే. లేకపొతే అన్ని ప్రధాన పార్టీల నుంచి ఆ మీడియాకు వేధింపులు, వేధింపులతో పాటు ప్రజల సపోర్ట్ కూడా వుండదు. ఈ పరిస్థితికి కారణం కచ్చితంగా మన నాయకులే అన్నది సత్యం. అధికారం కోసం నాయకులు చెయ్యని నీచమైన పని అంటూ ఏదీ మిగలలేదు.

తెలుగు ప్రజలు ఇప్పటికే కులం పేరుతో ద్వేషాలు పెంచుకొని, 24X7 మాటలతో కొట్టుకు చచ్చేలా మన నాయకులు విజయం సాధించారు. అధికారం కోసం ప్రాంతం పేరుతో కొట్టుకు చావడానికి మన కేసీఆర్ ను మన వైయస్సార్ సృష్టిస్తే, అదే అధికారం కోసం మన చంద్రబాబు కూడా వైయస్సార్‌నే ఫాలో అయ్యాడు.

దురదృష్టం ఏమిటంటే తెలుగు ప్రజలు రెండు ప్రాంతాలుగా విడిపొయాక కూడా మన కేసీఆర్ రెచ్చగొట్టే ప్రసంగాలు కొనసాగిస్తూనే వున్నాడు.

కేసీఆర్ నిజంగా చెడ్డోడా అంటే కాదు, తనకు బెండ్ అయినా ప్రతి ఆంధ్ర దోపిడిధారోడికి వెన్నుగా నిలుస్తున్నాడు. ఎదురు తిరిగిన ప్రతోడిని ఆంధ్రప్రాంతం అనో, తెలంగాన వాడైతే ఆంధ్ర ప్రాంతం వాళ్ళకు బానిసాగా వున్నాడనో .. ప్రజలను రెచ్చ గొట్టే వెటకారపు ప్రసంగాలు చేస్తునే వున్నాడు.

ఆస్తులున్న ఆంధ్ర వాళ్ళు తెలివైన వాళ్ళు కాబట్టి, కేసీఆర్ ముందు బెండ్ అవ్వడానికి అసలు మొహమాట పడరు.

ఈ రెచ్చగొట్టే ప్రసంగాల ప్రభావం సామాన్యులపై చూపించే అవకాశం బాగా వుంది. భరిస్తారు .. భరిస్తారు .. భరిస్తారు .. భరించలేక తిరగబడితే? .. ఇదే పవన్‌కల్యాణ్ ఆవేదన.

“ఓటుకు నోటు” కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికాడు. దీని నుంచి బయట పడటానికి ప్రాంతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టడం తప్ప, చంద్రబాబుకు వేరే మార్గం లేకుండా పోయింది. ఆంధ్రవాళ్ళకు కామన్ కాపిటల్లో రక్షణ లేదంటూ సెక్షన్ 8 అమలు చెయ్యాలని ఇప్పుడు గుర్తుకు వచ్చింది.

bottomline:
మీరు మీరు కొట్టుకు చావండి. దయచేసి ప్రజల మధ్య విద్వేషాలు పెంచకండి. మనందరిదీ ఒకే దేశం అని గుర్తు పెట్టుకొండి.

Filed Under: Pawan Kalyan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *