ఇది నిజమయితే బాగుండును

Pawan Kalyan

రాష్ట్రం సర్వ నాశనం దిశగా పయనిస్తుంది. ప్రజలు ఇన్ని ఇబ్బందులు పడుతున్నా, ఒకరినొకరు విమర్శలు చేసుకుంటున్నారు తప్ప శాశ్వత పరిష్కారం ఏమిటి? దాని కోసం ఏమి చెయ్యాలని మాత్రం ఎవరూ ఆలోచించడం లేదు. చంద్రబాబుకు అధికారం లేకపొవడం వలన, చంద్రబాబు కూడా చెత్త విమర్శలు చెయ్యడానికి పరిమితమై పోయాడు.

చంద్రబాబు C/O వెన్నుపోటు. ఇది ఎవరూ ఖండించలేని విషయం. సాటి నాయకులపై సాటి పార్టీలపై తన మోసపూరిత వ్యుహాలు ఉపయోగించే వాడు, కాని ప్రజలను మోసం చేసే ప్రయత్నం చెయ్యలేదు. తెలుగుదేశం నాయకులు చిరంజీవిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నప్పుడు చాలా బాద కలుగుతాది. కాని రాజకీయలలో వున్నప్పుడు భరించక తప్పదు.

తెలుగుదేశం చేసే రాజకీయాలు చెత్తగా వున్నాయనిపిస్తుంది కాని, ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితులు సరైన మార్గంలోకి రావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే సాధ్యం అనిపిస్తుంది.

ఎన్.టి.ఆర్ & పవన్‌కల్యాణ్ లు ఇద్దరూ తెలుగుదేశానికి ప్రచార కర్తలుగా వుంటే బాగుంటుందని, ఇగోలు పక్కన తెలుగుదేశం వాళ్ళను ఆహ్వానించదు, ఆహ్వానించినా వాళ్ళు ప్రచారం చేస్తారా అన్నది కూడా డౌటే.

Filed Under: Pawan Kalyan