పవన్‌కల్యాణ్ తక్షణమే స్పందించాలి

chandrababu_pawan

కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన కాపుగర్జన సభ.. ఊహించని రీతిలో ఉద్యమరూపం దాల్చి ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. తునిలో కాపుగర్జన సభలో కాపునాడు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అనూహ్యంగా రైలు, రాస్తా రోకోలకు పిలుపునివ్వడంతో కోల్కతా-జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. విజయవాడ-విశాఖపట్నం రైల్వే మార్గంలో రైళ్లను ఆపివేశారు. తుని రైల్వే స్టేషన్లో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్కు, తుని రూరల్ పోలీస్ స్టేషన్కు ఆందోళనకారులు నిప్పుపెట్టడంతో పరిస్థితి హింసాత్మకంగా మారింది.

ప్రశాంతంగా వున్న రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన ఘనత మన స్వర్గీయ వైయస్సార్ & చంద్రబాబులది. చల్లారిపొయిన తెలంగాణ వుద్యమాన్ని వైయస్సార్ నిప్పు అంటింస్తే, చంద్రబాబు పెట్రోల్ పోసి మంటలు పెంచాడు. కాని, ఆ పాపాన్ని సోనియాగాంధిపై నెట్టేసారు.

మళ్ళీ ఇప్పుడు, “కాపులకు రిజర్వేషన్లు” ఉద్యమానికి మన చంద్రబాబు నిప్పు అంటించాడు. జగన్ పెట్రోలు పోస్తున్నాడు. ముద్రగడ రైల్ రోకొ, రాస్తా రోకో చేయమని పిలుపునిచ్చిన మాట వాస్తవమే. కాని ఆయన కుల నాయకుడు. ఆయన పనే అది. ఆయన ప్రశాంతంగా చెయ్యమని చెప్పాడు. ఇలా రైళ్ళు తగలపెట్టమని చెప్పలేదు.

  1. “కాపులకు రిజర్వేషన్లు” విషయంలో స్పష్టమైన వివరణ ఇవ్వవలసిన బాద్యత చంద్రబాబుపై వుంది .. నిప్పు అంటించి, పెట్రోల్ పోసే వాళ్ళే బాద్యత వహించాలనటం, పెట్రోల్ పోసిన వాళ్ళపై చర్యలు తీసుకొవడం నీచమైన చర్య. ఇదే రాజకీయం, ఏమి చేసినా తప్పు కాదనుకొంటే, సామాన్య ప్రజలను దేవుడే కాపాడాలి.
  2. పవన్‌కల్యాణ్ ఆలోచింది, మూల కారణం ఏమిటనే దానిపై స్పందించాలి.
  3. ప్రజా ప్రయోజానల కోసం కాకుండా, పార్టీ ప్రయోజనాల కోసమే పనిచేసే మన రాజకీయ నాయకులను పవన్‌కల్యాణ్ ప్రశ్శించే సమయం వచ్చింది.

bottomline:
కులం అంటే మర్చిపొతున్న దిశగా ప్రజలు ప్రయాణం చేస్తుంటే, రాజకీయ ఆదిపత్యం కోసం కులాల మధ్య చిచ్చు పెట్టే దిశగా మన రాజకీయ నాయకులు ప్రజలను రెచ్చగొట్టడం క్షమించరాని నేరం.

పెట్రోలు పోసే రాజకీయ నాయకులదే కాదు, అసలు నిప్పు అంటించిన రాజకీయ నాయకులది కూడా తప్పే.

Filed Under: Pawan Kalyan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *  • Warning: file_get_contents(http://pawanfans.com/gallery3/index.php/randimg?size=fullsize&width=120&album=pawanfans) [function.file-get-contents]: failed to open stream: Connection refused in /homepages/39/d267182913/htdocs/home/wp-content/plugins/execphp.php(44) : eval()'d code on line 5