త్రివిక్రమ్ జ్యూస్ అయిపోయింది

Trivikram Srinivas with Hero Nitin

తెలుగులో జ్యూస్ అయిపొయిన దర్శకులు చాలా మంది వున్నారు. జ్యూస్ అయిపొవడం అంటే, ప్రేక్షకులు రిజెక్ట్ చేస్తున్నా ఒకే మూసలో సినిమాలు చెయ్యడం. వినాయక్, పూరి జగన్నాధ్, శ్రీనువైట్ల & so on..

దూకుడుకు ముందే శ్రీనువైట్ల జ్యూస్ అయిపొయినా, శ్రీనువైట్ల క్యారెక్టరైజేషన్ మహేష్‌బాబుకు కొత్త కావడంతో పాటు కామెడీ పండటంతో పెద్ద హిట్ అయ్యి శ్రీనువైట్లకు పునర్జన్మ ఇచ్చినట్టు అయ్యింది. ఆ తర్వాత నిలబెట్టుకొలేక పొయాడు. ప్రస్తుతం, తనని తాను అప్‌డేట్ అవ్వడానికి ప్రయత్నం చేసున్నాడు.

వి.వి.వినాయక్‌కు ఒక ఏడ్వాంటేజ్ వుంది. సొంత కథలు కాకుండా, హిరోకు నచ్చి తెచ్చుకున్న కథో, మంచి రైటర్‌తో రాయించుకున్న బయట కథో చేస్తుంటాడు. జ్యూస్ అయిపొయిన సమయంలో తన జోనర్ కాని, తాను ఆడప్ట్ చేసుకొలేని “అఖిల్” కథ చేసి హిరో అఖిల్‌కు పెద్ద పరీక్ష పెట్టాడు. మెగస్టార్ 150 వ చిత్రానికి దర్శకత్వం ఛాన్స్ వచ్చింది. కథ మీద & వినాయక్ మీద మెగాఫ్యాన్స్‌కు హిట్ అవుతుందని నమ్మకం లేదు. ఏం మ్యాజిక్ చేసి మళ్ళీ ఫార్మ్ లోకి ఎలా వస్తాడో చూడాలి.

పూరి జగన్నాధ్‌కు చాలా పెద్ద ఏడ్వాంటేజ్ ఏమిటంటే, కథ ఎటువంటిది అయినా పిచ్చ క్లారిటీతో వుంటాడు. మూడు నెలల్లో చుట్టేస్తాడు. జ్యూస్ అయిపొయి చాలా రోజులు అయినా నెట్టుకొస్తున్నాడు. ఎప్పుడో ఒకఫ్ఫుడు పొకిరీ లాంటి దిమ్మ తిరిగి బ్లాక్ అయ్యే హిట్ కొట్టాడా అని ఏ హిరోతో చేస్తుంటే ఆ హిరో అభిమానులు ఎదురుచూడటం అలవాటు.

ఇలా చెప్పుకుంటూ పొతే చాలా మంది వున్నారు .. రాజమౌళి మాత్రం, తన మాయతో కనెక్ట్ చేసుకుంటూ తెలుగుప్రేక్షకులతో కనెక్ట్ అయ్యే వున్నాడు.

S/O సత్యమూర్తి సినిమాను చాలామంది హిట్ అని కాకుండా ఫ్లాప్ అనటానికే ఇష్టపడతారు. “త్రివిక్రమ్ రేంజ్‌లో లేదు. త్రివిక్రమ్ జ్యూస్ అయిపోయింది. శ్రీనువైట్లను ఫార్ములా ఫాలో అవుతున్నాడు. మిర్చి సినిమాను కాపీ కొట్టాడు” అనే విమర్శలు వినిపించాయి. కాకపొతే త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు వున్న ఏడ్వాంటేజ్ “డైలాగ్స్”. సెంటిమెంట్ సీన్స్‌లో కూడా సెంటిమెంట్‌ను డామినేట్ చేసే విధంగా ఆయన డైలాగ్స్ వుంటాయి. ఇష్టపడే జనాలు ఇంకా వున్నారు. ఇప్పుడు సమంతా & నితిన్‌తో వస్తున్న “అ ఆ” పై భారీ అంచనాలు వున్నాయి.

పవన్‌ఫ్యాన్స్ సర్దార్ గబ్బర్‌సింగ్‌తో నిరుత్సాహానికి గురయ్యారు. బ్రహ్మోత్సవంతో మహేష్‌బాబు ఫ్యాన్స్ పవన్‌ఫ్యాన్స్‌కు తోడయ్యారు. మహేష్‌బాబు ఫ్యాన్స్ తోడుతో పవన్‌ఫ్యాన్స్ నిరుత్సాహం కొద్దిగా తగ్గింది. మహేహ్‌బాబు ఫ్యాన్స్ నిరుత్సాహం కొనసాగుతూనే వుంది. ఇంకా రెండు మూడు వారాలు ఆగి “అ ఆ” రిలీజ్ చేసి వుంటే బాగుండేది కాని, చాలా సినిమాలు లైనులో వుండటంతో “అ ఆ” జూన్ 2న్ వచ్చేస్తుంది.

అందరి ఫ్యాన్స్‌లో ఉత్సాహం నింపే సినిమా “అ ఆ” కావాలి.

Filed Under: అ ఆ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *