రెండు వారాల గ్యాప్‌లో సరైనోడు

bunny-pawan

మొన్న దసరా నెలలో వారం వారం గ్యాప్‌లో నాలుగు మెగా సినిమా రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు ఏప్రిల్ నెలలో రెం వారాల గ్యాప్‌లో రెండు మెగా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. సాయి ధర్మ్ తేజ్ “సుప్రీమ్” కూడా ఏప్రిల్ నెలలోనే రిలీజ్ అవ్వవలసి వుంది కాని, పోస్ట్‌పోన్ అయ్యే అవకాశాలు వున్నాయి.

అల్లు అర్జున్ ‘సరైనోడు’ చిత్రాన్ని ఏప్రిల్ 8న విడుదల చేయడానికి ప్లాన్ చేసారు. ఆ చిత్ర యూనిట్ రీ్‌కన్‌ఫార్మేషన్ చెయ్యకపొవడంతో సర్దార్ గబ్బర్ సింగ్ ఆ డేట్‌ను కబ్జా చేసి, సమ్మర్ కానుకగా ఏప్రిల్ 8న విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడటం కరెక్ట్ కాదని ఫిక్స్ అయిన ఈ చిత్రాల నిర్మాతలు, సరైనోడు విడుదల తేదీని ఏప్రిల్ 22 అని ఎనౌన్స్ చేసారు.

ఏవడు ఫేం దర్శకుడు పైడిపల్లి వంశీ – నాగార్జున “ఊపిరి” సినిమా మార్చి 28న వస్తుంది. త్రివిక్రమ్-నితిన్ మూవీ “అ .. ఆ..”. మహేష్‌బాబు “బ్రహ్మోత్సవం”, సాయిధర్మ్‌తేజ్ “సుప్రీమ్” ఏ డేట్స్‌కు రిలీజ్ చేస్తారో చూడాలి.

Filed Under: Featuredసర్దార్ గబ్బర్‌సింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *