పవన్‌కళ్యాణ్ డైలాగ్స్‌తో చలో హైదరాబాద్ ప్రొమో

pawan kalyan

తెలంగాన తెచ్చేది మేమే .. ఇచ్చేది మేమే .. ఆపేది మేమే .. ఇది కాంగ్రెస్ పార్టీ తీరు

మొన్నటి దాకా తెలంగాన ఏర్పాటుపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చిన తెలుగుదేశం,
కాంగ్రెస్ విభజన ప్రక్రియను మొదలుపెట్టగానే,
ప్రతిపక్షం ఓట్ల కోసం ఒత్తిడి తేవడం కామన్, అధికార పక్షం మాత్రం నో అనాలని ఇప్పుడు తెలుగుదేశం అంటొంది.

రాజకీయాలు అలా వుంటే, మెగాభిమానుల పరిస్థితి కూడా ఘోరంగా తయారవుతుంది.

పూల దండలూ మెగా హిరోల పోస్టర్సకే .. చెప్పు దెబ్బలూ మెగా హిరోల పోస్టర్సకే .. అన్నట్టు వుంది మెగా అభిమానుల పరిస్థితి

నిన్నటి దాకా యాభై ఏడేళ్ళ సమైక్య రాజధాని హైదరాబాద్‌ను UTగా చెయ్యాలని ప్రతిపాదించిన చిరంజీవి,
ఇప్పుడు UT ప్రతిపాదనను పక్కన పెట్టి,
ప్రజలు సమైక్యమే అంటున్నారని,
మాకు వేరే గత్యంతరం లేదంటున్నాడు.

సమైక్యం అంటే సరిపోదు,
చిరంజీవి సమైక్యాంధ్రకు మద్దతుగా మంత్రి పదవికి డ్రామా రాజీనామ చేయలేదని సీమాంధ్రలో,

తెలంగాన ఏర్పాటును వ్యతిరేకిస్తున్నాడని తెలంగానలో,

వసూళ్ళ రాయుళ్ళు రామ్‌చరణ్ తుఫాన్ రిలీజ్ సందర్భంగా టి.వి లలో తెగ రెచ్చిపోతున్నారు.

అభిమానులకు ఆ బాదలు సరిపోవనట్టు,
సమైక్యవాదులు కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలోని డైలాగ్స్‌తో చలో హైదరాబాద్ అంటూ ఒక ప్రొమో చేసారు.

ఆ ప్రొమో సీమాంధ్ర ప్రజలను ఎంత ప్రభావితం చేస్తుందో తెలియదు కాని
ఈ టైమ్‌లో తెలంగాన ప్రజలను రెచ్చగొట్టడం ఖాయం.

రెచ్చగొట్టడం .. చల్లార్చడం .. మనచేతుల్లో లేదు .. కాబట్టి ప్రాంతాలకు ఆతీతంగా ఆ సీన్లో పవన్ కల్యాణ్ చూపించిన ఎమోషన్స్ మరొసారి చూసి ఆనందించడమే.

Filed Under: Pawan KalyanFeatured