వెరీ వెరీ బ్యాడ్ ట్రెండ్

Pawan Kalyan

బిజినెస్‌మేన్ ఆడియో ఫంక్షన్‌లో పూరి జగన్నాధ్ యాంకర్ అవతారం ఎత్తి, మహేష్‌బాబును లైవ్‌లో ర్యాంగింగ్ చేసి ఒక కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టాడు. పైసా సినిమా ఆడియో ఫంక్షన్ నుంచి అనుకుంట, పిల్ల బ్యాచ్ హిరోలే యాంకర్లుగా మారి ఆడియో ఫంక్షన్‌కు వస్తున్న అతిధులను ర్యాంగింగ్ చెయ్యడం మొదలు పెట్టారు. ఈ ట్రెండ్ మరింత వరస్ట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వినోదం కాస్తా అసహ్యంగా మారుతుండటం కనిపిస్తుంది.

ఆ ట్రెండ్ అలా వుంటే, అమెరికాలో మరో కొత్త ట్రెండ్ మొదలయ్యింది. అదే రికార్డ్స్ కోసం టిక్కెట్టు రేటు డబుల్ చెయ్యడం. ప్రిమియర్ షో వాళ్ళకి ఇష్టం వచ్చిన రేటు పెట్టుకొవడంలో తప్పు లేదు, రికార్డ్స్ కోసం రెగ్యులర్ షోస్‌కు కూడా ఇంచుమించు అదే రేటు కంటిన్యూ చెయ్యడం వెరీ వెరీ బ్యాడ్ ట్రెండ్ అంటున్నారు.

అభిమానులు ఎంత రేటు అయినా అసలు ఫీల్ అవ్వరు. అభిమాన హిరో కోసం ప్రాణాలు కూడా ఇచ్చే అభిమానులున్నారు. డబ్బులు ఒక లెక్కా? .. అభిమానం అటువంటింది. అభిమానులపై అధిక భారం పడకుండా చూసుకో వలసిన బాద్యత ఫంక్షన్స్‌లో సోది కబుర్లు చెప్పే హిరోలపై వుంది.

పెంచిన రేట్లతో ఎంత కలక్షన్స్ సాధించాం అనే రికార్డ్స్ పక్కన పెట్టి,
మా సినిమా ఎంత మంది చూసారు? ఎంత మంది రిపీట్ గా చూస్తున్నారు? – దాని ద్వారా ఎంత కలక్షన్స్ అనే దానిపై పోటి పడితే బాగుండనని అనుకుంటున్నారు. ఇప్పుడు అత్తారింటికి దారేది సినిమా టిక్కెటు రేటుపై ఇబ్బందులు పడుతున్న నార్మల్ ప్రేక్షకులు, రేపు రామయ్యా వస్తావయ్యా కు కూడా తప్పవని అని అనుకుంటున్నారు.

Filed Under: Pawan KalyanFeatured