వి.వి. వినాయక్ తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొడతాడా?

Charan-Nayak

ఎన్.టి.ఆర్ అవకాశం ఇచ్చిన దర్శకులు వి.వి.వినాయక్ & యస్.యస్.రాజమౌళి. ఎన్.టి.ఆర్ నమ్మకాన్ని నిలబెడుతూ ‘ఆది’, ‘సిహాంద్రి’ లాంటి ఇండస్ట్రీ హిట్స్ ఎన్.టి.ఆర్ కు ఇచ్చారు. అతి చిన్న వయసులో ఎన్.టి.ఆర్ ను బిగ్ మాస్ స్టార్ గా చేసిన చిత్రాలు అవి. ఈ ఇద్దరు దర్శకులు ఎన్.టి.ఆర్ తమకు ఇచ్చిన అవకాశానికి బదులుగా, ఎన్.టి.ఆర్ తో జస్ట్ హిట్ సినిమా మాత్రమే కాకుండా, ఎన్.టి.ఆర్ కు ఒక కొత్త ఇమేజ్ సెట్ చేసే ప్రయత్నం చేస్తుంటారు.

‘యమదొంగ’ సినిమాలో సన్నబడిన ఒక సరికొత్త ఎన్.టి.ఆర్ ను రాజమౌళి చూపించాడు. ‘అదుర్స్’ సినిమాలో ద్వారా ఎన్.టి.ఆర్ లో ఎంటర్ టైన్ మెంట్ కోణం వి.వి.వినాయక్ చూపించాడు. ఈ రెండు సినిమాలు కేవలం కమర్షియల్ హిట్ మాత్రమే కాకుండా, ఎన్.టి.ఆర్ లో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి.

ఎన్.టి.ఆర్ ‘యమదొంగ’ సినిమా అనుభవంతో అదే బాట/ఫార్మెట్ లో రాజమౌళి తీసిన సినిమా ‘మగధీర’.

ఎన్.టి.ఆర్ ‘అదుర్స్’ సినిమా అనుభవంతో అదే బాట/ఫార్మెట్ లో వి.వి.వినాయక్ తీస్తున్న సినిమా ‘నాయక్’.

రాజమౌళిలా, వి.వి. వినాయక్ కూడా తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొడతాడా? .. ఒక రోజులో తెలిసిపోతుంది.

Filed Under: Mega FamilyFeatured