‘బాద్ షా’ కోసం ఎదురుచూస్తున్న ఓవర్ సీస్ తెలుగు ప్రేక్షకులు

ntr-baadshah

అల్లు అర్జున్ ‘వరుడు’ సినిమా టైటిల్ & పబ్లిసిటీ చూసి ఓవర్ సీస్ తెలుగు ప్రేక్షకులు చాలా మంది సినిమా చూడాలని డిసైడ్ అయిపోయారు. కాని ఫ్యామిలి సినిమా కాకుండా, యాక్షన్ సినిమా అని తెలిసి, దానికి డిజస్టర్ టాక్ తోడయ్యి అందరూ లాస్ట్ మినిట్ లో డ్రాప్ అయిపోయారు.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా అయితే, సినిమా ఎనౌన్స్ అయిన రోజే ఓవర్ సీస్ తెలుగు ప్రేక్షకులు థియేటర్ లో చూడవలసిన సినిమా అని డిసైడ్ అయిపోయారు. సినిమా పబ్లిసిటీ చేసినట్టు ఫ్యామిలి అందరూ కలిసి చూడతగిన చిత్రమే కావడం చేత కనివిని ఎరుగని రీతిలో జనాలు థియేటర్స్ కు తరలి వచ్చారు.

నాయక్ కు వచ్చిన టాక్ కు కూడా ఓవర్ సీస్ తెలుగు ప్రేక్షకులు బాగానే వచ్చే వాళ్ళు కాని, అదే వారం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా వుండటం పెద్ద దెబ్బ వేసింది. బ్యాక్ టు బ్యాక్ ఒకే వీకెండ్ రెండు సినిమాలు చూసే స్థాయికి మన ఓవర్ సీస్ తెలుగు ప్రేక్షకులు చేరుకోలేదు.

మొన్న వారం రిలీజ్ అయిన మిర్చి సినిమాకు కూడా ఓవర్ సీస్ తెలుగు ప్రేక్షకులు బాగానే తరలి వచ్చారు.

ఇప్పుడు అందరూ ‘బాద్ షా’ కోసం ఎదురుచూస్తున్నారు. ‘వరుడు’ సినిమా మాదిరి దారుణంగా అప్ సెట్ చెయ్యకుండా వుంటే చాలు, కలక్షన్స్ బాగుండే అవకాశం వుంది. సూపర్ హిట్ టాక్ వస్తే కలక్షన్స్ సునామీ తధ్యం. ‘బాద్ షా’ ఓవరాల్ షేర్ 50 కోట్లు చేరడానికి ఓవర్ సీస్ కలక్షన్స్ మేజర్ రోల్ ప్లే చేస్తాయి.

‘గబ్బర్ సింగ్’ తో పవన్ కళ్యాణ్ తన స్టామినాకు తగ్గట్టు తన పూర్వ వైభవాన్ని సాధించినట్టు, ‘బాద్ షా’ ద్వారా ఎన్.టి.ఆర్ కూడా ఫుల్ ఫాంలోకి వస్తాడని తెలుగుసినిమా ప్రేక్షకులు ఆశీస్తున్నారు.

Filed Under: Extended FamilyFeatured