కొరటాల శివతో చెయ్యాలనుంది

Kanche

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్ తేజ్ న‌టించిన తాజా చిత్రం కంచె. ఈ చిత్రాన్ని క్రిష్ తెర‌కెక్కించారు. గమ్యం , వేదం , కృష్ణం వందే జగద్గురుం వంటి సామజిక కథలకు , కమర్షియల్ హంగులను జోడించి తీయగల దర్శకుడు క్రిష్. ద‌స‌రా కానుక‌గా ఈనెల 22న కంచె చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు. రెండ‌వ ప్ర‌పంచ యుద్ధం నేప‌ధ్యంతో రూపొందిన కంచె ఖ‌చ్చితంగా క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ సాధిస్తుంద‌ని చిత్ర యూనిట్ న‌మ్మ‌కంతో ఉన్నారు.

వరుణ్ తేజ్ మొదటిసినిమా ముకుంద హిట్ అవ్వలేదు సరికదా, కమర్షియల్ సినిమాలకు దూరం అనే ముద్ర వేసింది. కంచె కూడా అదే బాటలో కమర్షియల్ సక్సస్ అవ్వదనే అనుమానం చాలా మందిలో వుంది. కమర్షియల్ మాస్ ఫ్యామిలి నుంచి వచ్చి, ట్రెండ్‌కు వ్యతిరేకంగా వెళ్ళుతున్న వరుణ్ తేజ్ కమర్షియల్ సినిమాలు చెయ్యలనే ఒత్తిడి వుంది. అందుకు తగ్గట్టుగానే నెక్స్ట్ సినిమా పూరి జగన్నాథ్‌తో చేస్తున్నాడు.

ప్రస్తుతం కంచె సినిమా పబ్లిసిటీలో భాగంగా వరుణ్ తేజ్ ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు. మీకు ఏ దర్శకుడితో సినిమా చెయ్యాలని వుందని అడిగితే, కొరటాల శివతో చెయ్యాలని వుందని సమాధానం ఇచ్చాడు.

Filed Under: Featuredకంచె

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *