వెస్టిన్ హొటల్ లో పవన్-త్రివిక్రమ్ షూటింగ్ విశేషాలు

pawan

ఈ సంవత్సరం ముందు ముందు రాబోయే చిత్రాలలో అత్యధిక క్రేజ్ కలిగిన చిత్రం పవన్-త్రివిక్రమ్ అంటే అతిశయోక్తి కాదు. గబ్బర్ సింగ్ సినిమాతో కమర్షియల్ హిట్ సాధించి, కెమెరామెన్ గంగతో రాంబాబు ఆత్మ సంతృప్తి చెందిన పవన్ కళ్యాన్, అదే ఉత్సాహాన్ని సాగిస్తూ త్రివిక్రమ్ సినిమా చేస్తున్నాడు.

రెండు నెలల క్రితమే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ వెస్టిన్ ఫైవ్ స్టార్ హోటలో లో ప్రారంభం అయ్యిందన్న సంగతి అందరికీ తెలిసిందే.

ఎన్ని రోజులు జరిగిందో తెలియదు కాని, కమీడియన్స్ మధ్య పవన్ కళ్యాణ్ సోలోగా చేసే ఒక సీను షూట్ చేసారంట. ఈ సినిమా వంద రోజులు ఆడటానికి ఈ ఒక్క సీను చాలు అని , ఆ సీను గురుంచి విన్న వ్యక్తి చెపుతున్నాడు. అతని మాటలు వింటుంటే తమ్ముడు సినిమాలో పవన్ కల్యాణ్ ఫోన్ లో చేసే సీను లాంటిదేమో అని అనిపించింది. ఈ సీను లో పాత సినిమాకు సంబంధించిన క్లిప్పింగ్ ఏదో వాడారంట.

నేటి యువతకు కావాల్సిన విధంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ పంచ్ వుంటుంది కాబట్టి అభిమానులు పండగ చేసుకునే విధంగా వుంటుందనటంలో ఎటువంటి సందేహం లేదు. పవన్ కల్యాణ్ ఈ సినిమాపై మంచి అవగాహనతో, ఇంటరెస్ట్ తో, భారీ రిహార్సల్స్ చేసి చేస్తున్నట్టుగా వుంది.

ఈ సమాచారం ఎంత వరకు నిజం అనేది తెలియాలంటే చాలా కాలం(సినిమా రిలీజ్ వరకు) వెయిట్ చెయ్యాలి.

Filed Under: Pawan Kalyan