“అత్తారింటికి దారేది” హీరో కారెక్టరైజేషన్

Pawan Kalyan

“అత్తారింటికి దారేది” మహిళా ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. దానికి కారణం ఎమోషన్ సీన్స్ బాగా పండాయి. అత్త చాలా హుందాగా వుంది. అత్తను ఏడిపించే హిరో కాదు, అత్తను ఎంతో గౌరవించే హిరో. కాని త్రివిక్రమ్ ఒక మెట్టు దిగి చేసాడు, ఆయన మార్క్ ఇంటిలిజెన్స్ పార్ట్ సినిమాలో కనిపించలేదు అనే విమర్శలు వున్నాయి.

“అత్తారింటికి దారేది” సినిమాపై త్రివిక్రమ్ అభిమానులు చేస్తున్న మేజర్ కంప్లైంట్ పక్కవాడ్ని కొట్టి కామెడీ పుట్టించడమేంటి అని. త్రివిక్రమ్ హీరోలెపుడూ తమ కారెక్టరైజేషన్ ని బట్టి నడుచుకుంటూ ఉంటారు, నువ్వేనువ్వేలో కుర్రాడు ఫిలాసఫీలు చెప్పినా, అతడులో హిట్మాన్ తక్కువ మాటాడినా, ఖలేజా లో టాక్సీ డ్రైవర్ అయిన హీరో బూతులు మాట్లాడినా తన పాత్రకి తగ్గట్టు సహజంగా ప్రవర్తించారు.

“అత్తారింటికి దారేది” సినిమాలో హీరో కూడా అదే చేశాడు. లక్షకోట్లకి అధిపతి, యంగ్ బ్లడ్ పైగా చిన్నతనంనుండీ కంటికి కనపడని శత్రువుతో బయటకి కనపడని యుద్దం చేస్తున్న మనిషి, పైగా కోపిష్టి దాన్నంతా ఎవరిమీద చూపిస్తాడు ? చిన్నప్పటినుండీ తనవెంటే తిరుగుతూ పక్కనే ఉంటున్న వాళ్ళమీదే కదా. తన వెంట ఉండే ఆరుగురిలో నలుగురు బాడీ గార్డ్స్ వాళ్ళని కొట్టినట్లు ఎపుడూ చూపించడు కేవలం పర్సనల్ అసిస్టెంట్స్ అయిన ఇద్దరిపై మాత్రమే చూపిస్తాడు.

మీరు చూసిన రిచ్ కిడ్స్ అలా ఉండి ఉండకపోవచ్చు కానీ గౌతంనందా అలాంటోడు. అవి హీరో పాత్ర ఫ్రస్టేషన్ నీ గొప్పదనాన్ని ఎలివేట్ చేయడానికి పెట్టుకున్న సీన్సే కానీ కేవలం కొట్టి కామెడీ పుట్టించడానికి పెట్టుకున్న సీన్స్ కాదు. అలా ఎవరినీ లెక్కచేయని ఏంకావాలన్నా క్షణాలలో కాళ్ళదగ్గరికి రప్పించుకోగల హీరో అత్త దగ్గర మాత్రం ఒదిగి ఉండడం తనకోసం డ్రైవర్ గా పనివాడిగా చేయడానికి సిద్దపడడమే ఎమోషన్ నీ బాగా కారీ చేయడానికి ఉపయోగపడింది.

Source: http://venusrikanth.blogspot.com/2013/10/blog-post.html

Filed Under: Pawan Kalyan