ఎవడు కథ ఏమిటి?

Yevadu

ఊహకందని స్థాయిలో ఈ చిత్రం కథ, కథానాలుంటాయి.

ఇందులో అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ ప్రత్యేక పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. వారి పాత్రలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి.

దిల్‌రాజు

అల్లు అర్జున్ పాత్ర ఐదు నిమషాలు మాత్రమే అయినా ఆయన పాత్ర చివరి దాకా ప్రేక్షకుల మైండ్ లో వుంటుంది.
పైడిపల్లి వంశీ

బన్ని ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకోవడం వలనే ఈ కథ చెయ్యడానికి నేను ఒప్పుకున్నాను
రామ్ చరణ్

ఎవడు కథ మనం చేద్దామని ఎన్.టి.ఆర్ నాతో అన్నాడు. బన్ని చేస్తున్న పాత్ర నన్ను చెయ్యమని అడిగాడు.
నందమూరి కల్యాణ్ రామ్

నాది ఐదు నిమషాలు కనిపించే పాత్ర మాత్రమే. ఇది పూర్తిగా చరణ్ సినిమా.
బన్ని

ఈ ప్రపంచం మొత్తం మీద ఏడే కథలుంటాయంటారు. ఏ సినిమా అయినా ఈ ఏడింటి చుట్టూ తిరగాల్సిందే. అయితే… కథకు కొత్తదనాన్ని ఆపాదించడం మాత్రం సదరు రచయిత సృజనపై ఆధారపడి ఉంటుంది.

నిజజీవితంలో చూసిన సంఘటన నుంచో, నాటకం నుంచో, సినిమా నుంచో, లేక చదివిన పుస్తకం నుంచో స్పూర్తి పొంది కథ రాసుకోవడం ఒక పద్ధతి.

ఎవడు సినిమా కథ 1997 హాలీవుడ్ లో వచ్చిన ‘face/off’ సినిమా నుంచి స్పూర్తి పొంది వ్రాసిన కథ అని రామ్ చరణ్ ఎప్పుడో చెప్పినట్టు గుర్తు.

Screen Shot 2013-07-20 at 8.50.00 AM

‘face/off’ కథ ఏమిటంటే హీరోకు విలన్ ఫేస్ పెట్టి విలన్ సామ్రాజ్యాన్ని నాశనం చెయ్యాలనుకుంటారు. ఆ విషయం వెరీ ఫ్యూ పీపుల్ కు తెలుసు. విలన్ కు మెలుకువ వచ్చి, హిరో ఫేస్ వేసుకొని విలన్ ఫేసుతో వున్న హీరోకు నానా కష్టాలు గురి చేస్తాడు. చివరికి హిరో తన అసలు రూపం సాధించడం తో పాటు విలన్ ను ఎలా అంతం చేసాడు అన్నదే ఆ సినిమా కథ.

‘face/off’ సినిమా నుంచి కేవలం ఒకరి ఫేసును ఇంకొకళ్ళకు అతికించవచ్చు అనే పాయింట్ మాత్రమే తీసుకొని, మిగతా కథ అంతా మన తెలుగు ప్రేక్షకులకు ఇష్టపడే విధంగా పగ, ఫైట్స్, పాటలు & హిరో బిల్డప్ తో పాటు కొద్దిగా థ్రిల్లింగ్ ఎలిమెంట్ కూడా యాడ్ చేసినట్టు వున్నారు.

అల్లు అర్జున్ body కి రామ్ చరణ్ ఫేస్. అల్లు అర్జున్ ‘ఎవడు’? రామ్ చరణ్ ‘ఎవడు’ ? అనే సస్పెన్స్ మేయింటేన్ చేస్తూ రైట్ టైమ్ లో రివీల్ చేస్తారనుకుంట.

జనాలకు అర్ధం అయ్యేలా చెపితే ఓకే. లేకపొతే సినిమా ప్రమోషన్ లో భాగంగా మేము ఇది చెప్పాలనుకున్నాం అని ముందే చెప్పేస్తే బెటర్. సినిమా విశ్లేషకులు ఒక అండర్ స్టాండింగ్ తో సినిమా చూడవచ్చు. ఈ విశ్లేషకులు సినిమా అర్ధం కాక బ్యాడ్ టాక్ స్ర్పెడ్ చేస్తే కష్టం .

Filed Under: Mega FamilyFeatured