ఎవరు గొప్ప?

ram-charan-allu-arjun

పవన్ ను, రామ్ చరణ్ ను మోసినంతగా అల్లు అర్జున్ ను మెగా ఫ్యాన్స్ మొయ్యరు. మెగా ఫ్యాన్స్ అంతలా మొయ్యక పోయినా, మెగా ఫ్యాన్స్ లో & తెలుగు ప్రేక్షకుల్లో అల్లు అర్జున్ మీద మంచి రెస్పక్ట్ వుంది. కారణం గంగోత్రి నుంచి ఇద్దరమ్మాయిలతో వరకు తనని తాను మార్చుకుంటూ కొత్త ట్రెండ్స్ క్రియేట్ చేస్తూ వచ్చాడు . అదే విధంగా స్నేహితులను ఎంకరేజ్ చేస్తూ వారికి కూడా టాలీవుడ్ లో స్థానం కలిపించి మంచి పేరు సంపాదించుకుంటున్నాడు.

రామ్ చరణ్ .. S/Oచిరంజీవి .. సినిమాల్లో చిరంజీవి లేని లోటును భర్తీ చేసి, అభిమానులకు చాలా దగ్గరయ్యాడు. దాసరే కాదు, ఎవడైనా చిరంజీవిని ఏమైనా అంటే ఎటువంటి మొహామాటం లేకుండా కడిగి పాడేసేగల సత్తా వున్నవాడు.

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా చూసాక, వెంకటేష్ ఏమిటి ఆ రోల్ ఒప్పుకోవడం ఏమిటని చాలా మంది విమర్శించారు. సినిమా అంతా వుంటాడు కాని, సినిమా రన్ అంతా మహేష్ బాబు మీదే నడుస్తుంది. వెంకటేష్ కు తన లిమిట్స్ తెలవడంతో దర్శకుడి విజన్ ను ఎంతో గౌరవిస్తాడు అంటారు.

ఇప్పుడు ‘ఎవడు’ సినిమా విషయానికి వస్తే:
తన హిరో ఇమేజ్ పక్కన పెట్టి, రామ్ చరణ్ సినిమాలో కేవలం ఐదు నిమషాలు రోల్ చేసిన అల్లు అర్జున్ గొప్పా? అల్లు అర్జున్ ఐదు నిమషాలు అయినా ఫస్ట్ నుంచి చివరి దాకా గుర్తుండే పాత్ర అంటున్నారు. అటువంటి ఇంపార్టెంట్ రోల్ తన సినిమాలో అల్లు అర్జున్ కు ఇచ్చిన రామ్ చరణ్ గొప్పా?

ఆ అల్లు అర్జున్ చేస్తాను అనబట్టే, నేను ఎవడు చేసాను అని రామ్ చరణ్ ఎందుకు అన్నాడు?

అసలు అల్లు అర్జున్ పాత్ర ఏమిటో తెలియాలంటే .. జస్ట్ ఒక వారమే ..

Filed Under: Mega FamilyFeatured