ఎవరా హిరో?

raviteja_pawan_ntr_alluarjun

‘మిర్చి’ చిత్రంతో దర్శకుడిగా మారిన ప్రముఖ మాటల రచయిత కొరటాల శివ ఫస్ట్ మూవీతోనే హిట్ కొట్టేసాడు. గబ్బర్‌ సింగ్ నిర్మాత బండ్ల గణేష్‌తో కొరటాల శివ తర్వాతి చిత్రం చేయబోతున్నారు.

ఆ సినిమాలో హిరో ఎవరు అనేది ఇప్పుడు టాక్ ఆఫ్ ది తెలుగు ఇండస్ట్రీ అయ్యింది.

బండ్ల గణేష్ నిర్మించిన/నిర్మిస్తున్న హీరోలలో ఒకరా? లేక వేరే హీరోనా అని ఇంకా తెలియవలసి వుంది.

ఆంజనేయులు హిరో రవితేజానా?
తీన్ మార్, గబ్బర్ సింగ్ సినిమా ల హిరో పవన్ కళ్యాణా?
బాద్ షా హిరో ఎన్.టి.ఆరా?
ఇద్దరమ్మాయిలతో హిరో అల్లు అర్జునా?

మిర్చి సినిమా హిట్ అయినా, అదే ఫ్యాక్షన్ బ్యాడ్రాప్ తో ఇంకా ఎన్ని సినిమాలు చూడాలనే విమర్శలు వినిపిస్తున్నాయి.

మిర్చి సినిమాపై వచ్చే విమర్శలు పక్కన పెడితే, ఈ సినిమా కథా రచయిత-మాటలు-దర్శకుడు గా కొరటాల శివ వర్క్ చాలా పకడ్భంధీగా వుందని ప్రశంసలు వినిపిస్తున్నాయి. మిర్చి సినిమాలో కామెడీ, సెంటిమెంట్ పండించడంతో పాటు డైలాగ్స్ అదరగొట్టాడు.

పవన్ కళ్యాణ్ చేస్తే బాగుంటుంది కాని, రవితేజకే ఎక్కువ ఛాన్స్ వుంది.

Filed Under: Pawan KalyanExtended FamilyFeatured