సినిమా వాళ్ళు తమ అభిప్రాయాన్ని ఎందుకు చెప్పడం లేదు

cameraman-ganga-tho-rambabu-working-stills-stills010

టి.వి9 లో ఒక సమైక్య నాయకుడు “సినిమా వాళ్ళకు సామాజిక బాద్యత లేదా? .. సినిమా వాళ్ళు ఎందుకు స్పందించడం లేదు?” అని ప్రశ్నిస్తున్నాడు.

ఈ సమైక్య నాయకులు & తెలంగాన నాయకులు
ఒకరి అభిప్రాయలు తమకు అనుకూలంగా వుందా లేదా అని చూస్తున్నారు కాని, వారి అభిప్రాయానికి గౌరవం ఇస్తున్నారా?

ఒక తెలుగు వాడు “నా అభిప్రాయం ఇది” అని చెప్పుకునే హక్కు కొల్పోయేలా ఎప్పుడో చేసారు ఈ రాజకీయ నాయకులు. ఇప్పుడు దానినే ఫాలో అవుతున్నారు మూర్ఖపు పనికి మాలిన మేధావులు. ఒక తెలంగానకు చెందిన వాడు ధైర్యంగా బయటకు వచ్చి ‘కలిసుందాం’ అనే పరిస్థితి లేదు. అదే విధంగా “తెలంగానకు ఒప్పుకున్నాం కదా, విడిపోదాం” అనే పరిస్థితి సామాన్య సీమాంధ్రులకు లేదు.

ఒక హక్కును ఇలా కొల్పోవడం అనేది క్షమించరాని దారుణం. ఏ వినాశానికి దారి తీస్తుందో ఎదురు చూడటం తప్ప, హాక్కుల కోసం పొరాడలేని నిస్సాహాయులు ప్రజలు.

For suppose, ఒక జడ్జ్ వచ్చాడు అనుకుందాం:

వారిని ఆడిగే మొదటి ప్రశ్న. నువ్వు తెలంగాన వాడివా? సీమాంధ్ర వాడివా? అని అడుగుతారు.

1. జడ్జ్ తెలంగాన వాడై వుండి, విడిపొండి అంటే “జడ్జ్ తెలంగాన వాడు” అని ముద్ర వేస్తారు.
2. జడ్జ్ తెలంగాన వాడై వుండి, కలిసుండండి అంటే “తెలంగానలో చెడ బుట్టావు” అని ముద్ర వేస్తారు.
3. జడ్జ్ సీమాంధ్ర వాడై వుండి, కలిసుండండి అంటే “సీమాంద్ర వాడివి” అని ముద్ర వేస్తారు.
4. జడ్జ్ సీమాంధ్ర వాడై వుండి, విడిపోండి అంటే “సీమాంద్రలో చెడబుట్టావు” అని ముద్ర వేస్తారు.

నేను తెలుగొడిని కాదు, కర్నాటక వాడొని అంటే:

“మధ్యలో నువ్వు ఎవడివిరా మా తెలుగు వాళ్ళు కలిసుండాలో, విడిపొవాలో చెప్పడానికి ” అని అంటారు.

మేధావులు & నాయకులే ఇంత మూర్ఖంగా వితండ వాదం చేస్తుంటే, తమ అభిప్రాయలను ఎవరైనా ఎందుకు చెపుతారు?

“కెమెరామెన్ గంగతో రాంబాబు” సినిమా ముఖ్య వుద్దేశం “ఏ ఉద్యమం మైనా నిజాయితీగా చెయ్యాలి. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను ఇబ్బందులు పెట్టే విధంగా వుండకూడదు. మనం ఎంత గౌరవాన్ని కోరుకుంటున్నామో, పక్క వారిని అంతే గౌరవించాలి.”

ఆ సమయంలో తెలంగాన ఉద్యమానికి ఆ సినిమా వ్యతిరేకంగా అనిపించడానికి కారణం తెలంగాన ఉద్యమాన్ని రాజకీయ నాయకులు నడిపిస్తున్న తీరే. ఇప్పుడు అదే తీరులో సమైక్య ఉద్యమాన్ని నడిపిస్తున్నారు నాయకులు.

సమైక్య ఉద్యమంలో కూడా దొంగలు చొరబడ్డారనేది వాస్తవం. హిరో అయిపొదామనో, చందాలు వసూళ్ళు చేసుకుందామనో టి.వి లు ఎక్కి నాన లొల్లి చేస్తున్నారు.

మనోడు కానివాడిని బలి చేద్దాం అనే తలంపుతో సమైక్యానికి నాయకత్వం వహించే వాళ్ళు తప్ప,
నిజం మాట్లాడే దమ్మున్న నాయకుడు ఒక్కడు కూడా లేకపొవడం దురదృష్ట కరం. దాని ప్రభావమే మన రాష్ట్రం సర్వ నాశనం వైపు నడుస్తుంది.

అందుకనే
సినిమా వాళ్ళే కాదు, ప్రతి సామాన్యుడు ప్రేక్షక పాత్ర వహించారు.

Filed Under: Pawan KalyanFeatured