వండర్‌ఫుల్ ‘రామయ్యా వస్తావయ్యా’ ఆడియో ఫంక్షన్

Young NTR

ప్రజలు నిస్సాహాయులు.

రాజకీయాలంటే ఒకరిని మించి ఒకరు ప్రజలను మోసం చెయ్యడం. అలా మోసం చేస్తూ, తమ వాగ్దాటితో అడ్డంగా వెటకారంగా ప్రజలను మభ్య పెట్టే వాడే సమర్దమైన రాజకీయ నాయకులుగా పిలవ బడుతున్నారు. అలా పోటి పడి పోటి పడి, ఈ రాజకీయ నాయకులు రాష్టాన్ని ఏ స్థాయి తీసుకు వచ్చారో ప్రత్యక్షంగా చూస్తూనే వున్నాం.

అభిమానులు పిచ్చోళ్ళు.

ఆ రికార్డులు .. ఈ రికార్డులు .. హిరోలు తమకున్న పిచ్చిని, “అభిమానులను ఉత్సహ పరచడానికి” అనే నెపంతో అభిమానుల మీదకు నేట్టేసి తమ ఇమేజ్‌ను పెంచుకునే ప్రయత్నం చేస్తూ వుంటారు. అది నిజమనుకుంటారు పిచ్చ అభిమానులు.

అంతే కాదు నాకెంత మంది అభిమానులున్నారో చూడండి అని ప్రపంచానికి చాటడానికి, అభిమానుల సమక్షంలో అని పేరు పెట్టి, అభిమానులను ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తూ వుంటారు.

ఆడియో ఫంక్షన్ గ్రాండ్‌గా లేకపొయినా:
అభిమానులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా,
మరో వైపు ఆడియో ఫంక్షన్ పూర్తిగా మానేయ్యకుండా,
చాలా సింపుల్ గా ఆడియో ఫంక్షన్ నిర్వహించినందున “వండర్‌ఫుల్ ‘రామయ్యా వస్తావయ్యా’ ఆడియో ఫంక్షన్” అయ్యింది.

హాట్సాఫ్ యంగ్ ఎన్.టి.ఆర్.

గబ్బర్‌సింగ్ సినిమాతో ఓవర్ నైట్ పెద్ద దర్శకుల సరసన నిలిచిన హరీష్‌శంకర్ దర్శకత్వంలో ఎన్టీఆర్, సమంత, శ్రుతిహాసన్ కాంబినేషన్‌లో ‘దిల్’ రాజు నిర్మించిన చిత్రం ‘రామయ్యా వస్తావయ్యా’. తమన్ పాటలు స్వరపరిచారు. శనివారం హైదరాబాద్‌లో ఈ చిత్రం పాటల సీడీని వీవీ వినాయక్ ఆవిష్కరించి, రాజమౌళికి ఇచ్చారు.

Filed Under: Extended FamilyFeatured