World Record Poster

baahubali

‘బాహుబలి’ చిత్రం విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో సినిమాపై జనాలకు ఆసక్తి పెరుగుతూ వుంది. ఇప్పటికే విడుదలైన ‘బాహుబలి’ ట్రైలర్లు, పాటలు మంచి ప్రేక్షకాదరణ పొందాయి. హైప్‌కు తగ్గట్టుగానే జూలై 10న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా తెలుగు, తమిళ, మళయాల, హిందీ భాషల్లో భారీ ఎత్తున సుమారు నాలుగు వేలకు పైగా ధియేటర్లలో విడుదల చేస్తున్నారు. సినిమా యూనిట్ ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. అందులో భాగంగా నిన్న జరిగిన మళయాల ఆడియో ఆవిష్కరణలో ప్రపంచంలో ఇప్పటివరకూ ఎక్కడా ఆవిష్కరించనంత సైజులో అతిపెద్ద పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ప్రభాస్‌, అనుష్క, తమన్నా, రానా ఇతర ముఖ్య పాత్రధారులు. ప్రసాద్‌ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మాతలు. కె.రాఘవేంద్రరావు సమర్పకుడు. రాజమౌళి దర్శకుడు. కీరవాణి మ్యూజిక్.

Filed Under: Featuredబాహుబలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *