దీపావళికి ఎవడు?

Ram-Charan

రామ్ చరణ్, వంశీ పైడిపల్లి కాంబినేషన్లో దిల్ రాజు నిర్మించిన ‘ఎవడు’ ఏ ముహుర్తాన ఈ సినిమా మొదలైందో, మొదలైన దగ్గర నుండి రిలీజ్ వరకు అడ్డంకులే. మొత్తానికి చిత్రాన్ని దీపావళికి విడుదల చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. సినిమా రెడీ అయిపోయి, సెన్సార్ కూడా పూర్తి చేసుకుని గత రెండు నెలల నుంచీ విడుదలకు నోచుకోకుండా, ఈ సినిమా ఆగిపోయిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ అనిశ్చితి కారణంగా ఈ సినిమా చాలా ఎఫెక్ట్ అయింది.

‘అత్తారింటికి దారేది’ సినిమా విడుదలతో పరిస్థితులు కాస్త కుదుటపడ్డాయనుకుంటే… ఈ సినిమా నిర్మాత దిల్ రాజు నిర్మించిన మరో సినిమా ‘రామయ్యా వస్తావయ్యా’ విడుదలకు రెడీ అయిపోవడం … దాంతో దీనిని వెనక్కు నెట్టేయడం జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ ‘ఎవడు’ చిత్రాన్ని దీపావళికి వదలడానికి నిర్మాత ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

Filed Under: Mega FamilyFeatured