‘ఎవడు’ సినిమా ఆగష్టు 21కి వాయిదా

yevadu

నిస్వార్దంతో నిజాయితీగా ఎవరైనా ఏదైనా బలంగా కోరుకుంటే, అది జరగడానికి అవకాశం వుందని ఒక పుస్తకంలో చదివాను

— చిరంజీవి

నిజానికి హీరోలు తీసుకునే నిర్ణయాలు ఫ్యాన్స్ కు తప్పు అని అనిపించినా “అలా జరగకుండా వుంటే బాగుండును” అని కోరుకోవడం తప్ప ఫ్యాన్స్ ఏమి చెయ్యలేరు. “అత్తారింటికి దారేది” “ఎవడు’ సినిమాల మధ్య కనీసం రెండు వారాలు గ్యాప్ వుండాలని మెగాఫ్యాన్స్ బలంగా కోరుకున్నట్టు వున్నారు. రామ్ చరణ్ ‘ఎవడు’ సినిమా ఆగష్టు 21కి వాయిదాపడింది.

రాష్ట్ర విభజన నేపధ్యంలో ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల నడుమ జరుగుతున్న హై డ్రామా నేపధ్యంలో ఈ సెగ మన టాలీవుడ్ కు సైతం సాకింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఎవడు’ సినిమా ఆగష్టు 21కి వాయిదాపడింది. ముందుగా ఈ చిత్రాన్ని ఈ నెల 31కి విడుదల చేద్దామనుకున్నారు, అయితే ప్రత్యేక తెలంగాణా నేపధ్యంలో కాంగ్రెస్ కోర్ కమిటీ ఆగష్టు 2న తమ నిర్ణయం తెలిపే ఆస్కారం వున్న కారణాన ఆ తేదిలలో గొడవల జరిగే అవకాశం వుంది కనుక ఈ సినిమాను సేఫ్ డేట్ కు వాయిదా వేసారు. ఈ సినిమాను చిరంజీవి పుట్ట్టినరోజు కానుకగా ఆగష్టు 21న విడుదల చేస్తామని తెలిపారు. శృతిహాసన్, అమీ జాక్సన్ లు హీరోయిన్స్. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్. అల్లు అర్జున్ మరియు కాజల్ ముఖ్యమైన పాత్రలను పోషించారు.

safe note by author of this article:
వేరే బలమైన శక్తులు ఆ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవ్వాలనో, వారం మాత్రమే గ్యాప్ వుండాలనో కోరుకుంటే “అత్తరింటికి దారేది” కూడా ఆగష్టు 14 కో, ఆగష్టు 21 కో వాయిదా పడటానికి అవకాశం వుంది.

Filed Under: Mega FamilyFeatured