“ఎవడు” పబ్లిసిటి

ram charan

ఎంత పెద్ద హిరో అయినా, ఎంత పెద్ద దర్శకుడు అయినా పబ్లిసిటీ చాలా అవసరం.“పబ్లిసిటీ అంటే మా సినిమా నుంచి ఈ అంశాలు ఎక్సపేట్ చెయ్యండి” అని ప్రేక్షకులను ప్రిపేర్ చేయడం.

సినిమాలో ప్రాముఖ్యత లేని అంశాలతో సినిమా రిలీజ్ కు ముందు సినిమాపై అంచనాలు పెంచే విధంగా పబ్లిసిటీతో సినిమాను హైప్ చేయడం మరో రకమైన పబ్లిసిటీ. ఒక కోణంలో మోసం అనిపించినా , ఈ రకమైన పబ్లిసిటీని తీసిపారేయలేం .

రచ్చ ప్రి రిలీజ్ పబ్లిసిటి కూడా చెయ్యలేదు. కాని లాస్ట్ మినిట్ లో రిలీజ్ చేసిన “డిల్లక్ ” సాంగ్ స్టెప్స్ ట్రైలర్ అభిమానులకు బాగా నచ్చి, ఒక్కసారిగా ఎక్కడ లేని హైప్ వచ్చింది. నాయక్ ప్రి రిలీజ్ పబ్లిసిటి బాగా చేసారు. రచ్చ & నాయక్ రెండు సినిమాలు పక్కా మాస్ సినిమాలు. ఏ విధమైన కొత్తదనం ఆ రెండు సినిమాల్లో లేకపోవడం, వుండదు అని ప్రేక్షకులకు ముందే తెలుసు .. అలానే ప్రిపేర్ అయ్యారు. సాంగ్స్ అదిరిపోవడంతో రెండు సినిమాలు ఫస్ట్ డే టాక్ పాజిటివ్ గా వచ్చాయి.

ఎవడు సినిమా కొత్తదనం తో కూడిన సబ్జక్ట్ & సినిమా కోసం రెండు సంవత్సారాలు పైనే కష్ట పడ్డారు. ప్రేక్షకులను జాగ్రత్తగా ప్రిపేర్ చెయ్యాలి. కన్ ఫ్యూజన్ లేకుండా కథ అవుట్ లైన్ చెప్పేస్తే బెటర్.

మగధీర సినిమా నుంచి పబ్లిసిటిలో భాగంగా మొత్తం కథ చెప్పేస్తున్నాడు రాజమౌళి. it worked for both ‘మగధీర’ & ‘మర్యాద రామన్న’. ఈగ’ ట్రైలర్ లో మొత్తం కథ చెప్పడం కాదు, చూపించేసాడు. రెండు నిమషాల ట్రైలర్ లో చూపించిందే, రెండున్నర గంటల పాటు చూపించి ప్రేక్షకుడిని ఉత్కంఠతో కూర్చోపెట్టాడు.

చరణ్ కు దేవిశ్రీ ప్రసాద్ ఇనిస్టెంట్ హిట్ సాంగ్స్ ఇవ్వక పోయినా, సాంగ్స్ ను తన స్టెప్స్ తో రామ్ చరణ్ మంచి రేంజ్ కు తీసుకొని వెళ్ళగలడు.

bottom line:
“ఎవడు” సినిమాకు రైట్ పబ్లిసిటి అవసరం ఎంతైనా వుంది. రాజమౌళి తరహాలో కథ అవుట్ లైన్ చెప్పేస్తే బెటర్.

Filed Under: Mega FamilyFeatured