‘మగధీర’ రిలీజైన జూలై 31నే ‘ఎవడు’

yevadu

ఏమిటో ‘ఎవడు’ సినిమాను మగధీర తో పోల్చడమే కాదు, అదే రోజు జూలై 31నే రిలీజ్ చేస్తున్నారు. సినిమాను హైప్ చెయ్యడానికి చరణ్ చిరంజీవి పాటలను రిమిక్స్ చేసి తన సినిమాలో ఎలా పెట్టుకుండాడో, ఈ రిలీజ్ డేట్ కూడా అలానే ‘ఎవడు’ సినిమాను హైప్ చెయ్యడానికి వాడుకుంటున్నట్టు వున్నారు.

డేట్ ఎనౌన్స్ చేసి జూలై 24 న వస్తుందనుకుంటున్న ఆశలకు త్వరగా తెరదించినందుకు చాలా సంతోషం. అదే విధంగా “అత్తారింటికి దారేది” ఆగష్టు 7 నుంచి లాస్ట్ మినిట్ లో పొస్ట్ పోన్ చెయ్యకుండా, ఇప్పుడే చేసేస్తే బెటర్. డేట్ మారకుండా వుంటే ఇంకా బెటర్.

ఎన్.టి.ఆర్ “బృందావనం” లాస్ట్ మినిట్ లో పొస్ట్ పోన్ చేసినపుడు ఎన్.టి.ఆర్ అభిమానులు ఎంత అసహనానికి గురయ్యారో తెలిసిందే.

ఊహకందని స్థాయిలో ఈ చిత్రం కథ, కథానాలుంటాయి.

రామ్‌చరణ్ కెరీర్‌లో మరో మైలురాయిగా ఈ చిత్రం నిలుస్తుందని మా నమ్మకం.

జూలై మెగా ఫ్యామిలీకి బాగా అచ్చొచ్చిన నెల. చిరంజీవిగారి ‘ఇంద్ర’, పవన్‌కల్యాణ్‌గారి ‘తొలిప్రేమ’, రామ్‌చరణ్ ‘మగధీర’ చిత్రాలు ఇదే నెలలో విడుదలై సంచలనాలు సృష్టించాయి.

ముఖ్యంగా ‘మగధీర’ రిలీజైన జూలై 31నే ‘ఎవడు’ కూడా వస్తోంది. ఆ ఫీట్‌ని ఈ చిత్రం రిపీట్ చేస్తుందని నా నమ్మకం.

శ్రుతి హాసన్, అమీ జాక్సన్ అందాలు, దేవిశ్రీప్రసాద్ మెస్మరైజింగ్ మ్యూజిక్.. వీటన్నింటినీ మించి వంశీ మేకింగ్ ఈ చిత్రానికి ప్రధాన బలాలుగా నిలువనున్నాయి.

ఇందులో అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ ప్రత్యేక పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. వారి పాత్రలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి.

దిల్‌రాజు

Filed Under: Mega FamilyFeatured