మాక్సిమమ్ థియేటర్స్ లో ఎవడు

yevadunewsjuly25

2013 సంక్రాంతి రెండు భారీ సినిమాలు రెండు రోజులు గ్యాప్ లో రిలీజ్ అయ్యాయి. ఒకటి రామ్ చరణ్ ‘నాయక్’. ఇంకోటి మహేష్ బాబు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. ఆ సినిమా లేదా ఈ సినిమా .. పండగ హాలీడేస్ కు రెండు సినిమాలు సరిపోని వాళ్ళు, జనాలకు ఇంకో ఆప్షన్ లేదా అని అనుకున్నారు.

కొందరు జనాల బాద అలా వుంటే, మంచి ధియేటర్స్ & ఎక్కువ ధియేటర్స్ ‘నాయక్’ కు దక్కకుండా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ కోసం దిల్ రాజు ఆక్రమించేసాడని కొందరు మెగా ఫ్యాన్స్ గొడవ చేసారు.

జనాలు, ఫ్యాన్స్ బాదలు పక్కన పెడితే

వర్షా కాలంలో రెండు మెగా సినిమాలు వస్తుండటంతో, పండగలు లేకపోయినా పండగ వాతావరణం నెలకొంది. ఈ పండగ వాతావరణాన్ని క్యాష్ చేసుకోవడానికి దిల్ రాజు మాక్సిమమ్ థియేటర్స్ లో ‘ఎవడు’ చేస్తున్నాడంట.

ఒకప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్ళు తమ భూముల రేట్లు పెరిగి ఎలా ఎంజాయ్ చేసారో, తెలంగాణ ఉద్యమం వలన ఇప్పుడు సీమంధ్ర వాళ్ళ భూముల రేట్లు పెరిగి అంతే ఎంజాయ్ చేస్తున్నారు. పైకి మాత్రం తెలంగాణ ఉద్యమం వలన తామోదో నష్టపోయినట్లు కబుర్లు చెపుతూ వుంటారు.

రెండు సినిమాలు ఇంత తక్కువ గ్యాప్ లో రిలీజ్ అవ్వడం వలన రెండిటికి నష్టం అని అంటున్నారు కాని, నిజానికి ఇంత తక్కువ గ్యాప్ లో రిలీజ్ అవ్వడం వలన జనాల్లో మంచి సినిమా మూడ్ క్రియేట్ అయ్యింది. రెండిటికి ప్లస్సే. రెండు సినిమాలలో బాగున్న సినిమాకు ఇంకా పెద్ద ప్లస్.

Filed Under: Mega FamilyFeatured