మగధీరను తలపించబోయే ఎవడు

Yevadu Audio

రామ్‌చరణ్, శ్రుతిహాసన్, అమీజాక్సన్ హీరో హీరోయిన్లుగా అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ అతిథి పాత్రల్లో రూపొందిన చిత్రం ‘ఎవడు’. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. సోమవారం రాత్రి జరిగిన ఈ ఆడియో వేడుకలో సీడీని చిరంజీవి ఆవిష్కరించి రామ్‌చరణ్, అల్లు అర్జున్‌కి ఇచ్చారు.

ఈ వేడుకలో డీవీవీ దానయ్య, డా. వెంకటేశ్వరరావు, పి. కిరణ్, ఎన్వీ ప్రసాద్ & శ్రుతిహాసన్, దేవిశ్రీప్రసాద్, సాయికుమార్ వంశీ పైడిపల్లి, ‘దిల్’ రాజు తదితర చిత్రబృందం కూడా పాల్గొన్నారు.

ఎక్సపెటేషన్స్ పెంచడం ఇష్టం లేదంటూనే సినిమా మగధీరను తలపించే విధంగా వుంటుందని హైప్ చేసే ప్రయత్నం చేసారు. ఆ మాటలు ఎంత నిజమో తెలియాలి అంటే ఇంకో నెల ఆగాల్సిందే.

సాంగ్స్ అన్నీ కొత్త సౌండింగ్ తో వున్నాయి. సాంగ్స్ హిట్ అవ్వాలంటే సినిమా రావాలి. ట్రైలర్ చూస్తుంటే , “గజిని” టైప్ కిల్లింగ్స్ వున్నాయనిపించింది. విమర్శకులు కోరుకునే వైవిధ్యమైన సినిమాలా వుంది.

రామ్ చరణ్ సినిమానే కాదు, ప్రతి సినిమాను మగధీరతో పోల్చడం మాములే. కలక్షన్స్ లో మగధీరను కొట్టడం కష్టమే, కాని చరణ్ కెరీర్ లో ఇంకో బెస్ట్ & కమర్షియల్ ఫిలిమ్ అవ్వచ్చోమే అనిపిస్తుంది.

Filed Under: Mega FamilyFeatured